తెలంగాణ ఎన్నికల్లో చంద్రబాబుని బూచిగా చూపించి కేసీఆర్ అఖండ విజయం సాధించారు. మన తెలంగాణపై మళ్లీ పెత్తనం సాధించడానికి చంద్రబాబు వస్తున్నారని చెప్పి స్వాభిమానం రగిల్చారు. దీంతో.. సెంటిమెంట్ గా ఫీలైన తెలంగాణ ప్రజలు మహాకూటమిని చిత్తుచిత్తుగా ఓడించారు. ఇప్పుడు ఇదే అస్త్రాన్ని ఏపీలో వాడుకుంటున్నారు చంద్రబాబు. అందుకే అవసరం ఉన్నా లేకపోయినా... కేసీఆర్ ప్రస్తావన తెస్తూ ఆ సెంటిమెంట్ తో ఓట్లు రాల్చుకోవాలని చూస్తున్నారు. కానీ ప్రస్తుతం ప్రజలు చంద్రబాబు మాటల్ని నమ్మే పరిస్థితి కన్పించడం లేదు. అయితే.. చంద్రబాబు కామెంట్స్ ని చాలా నిశితంగా గమనిస్తున్న కేసీఆర్ మాత్రం ఏమాత్రం ఆవేశపడడం లేదు. ఎందుకంటే ఇప్పుడు ఆవేశపడితే.. అది కాస్తా చంద్రబాబుకి ప్లస్ అవుతుంది. అందుకే ఆయన సైలెంట్ అయ్యారు.
అయితే.. చంద్రబాబు ప్రవర్తనపై కేసీఆర్ లోలోపల రగిలిపోతున్నారు. టైమ్ వచ్చినప్పుడు చంద్రబాబుని ఓ రేంజ్ లో ఆడుకునేందుకు పక్కా ప్రణాళికతో సిద్ధమయ్యారు. మొన్నటికి మొన్న ఎన్నికల్లో విజయం తర్వాత తొలిసారిగా ప్రెస్ మీట్ పెట్టి మరీ చంద్రబాబుపై చెలరేగిపోయారు. నా జీవితంలో బాబు అండ డర్టీయెస్ట్ నాయకుడ్ని చూడలేదని తేల్చిపారేశారు. కేసీఆర్ తిట్టిన తిట్లకు కొన్ని రోజులు చంద్రబాబు మీడియా ముందుకు రాలేదంటే అతిశయోక్తి కాదు. ఇక ఇప్పుడు కూడా చంద్రబాబుని ఏప్రిల్ 11 తర్వాత ప్రెస్ మీట్ పెట్టి మరీ దుమ్ముదులపాలని అనుకుంటున్నారట కేసీఆర్. అప్పటికే ఎన్నికలు అయిపోతాయి. ఆ తర్వాత సెంటిమెంట్లు, ఆయింటుమెంట్లు వర్కవుట్ అవ్వలేదు. దీంతో.. ఏప్రిల్ 11 సాయంత్రం కానీ.. ఆ తర్వాత కానీ చంద్రబాబుకి పట్టపగలే చుక్కలు చూపించాలని అనుకుంటున్నారు. మొన్నటి డోస్ కే వారం రోజులు మాయమైపోయిన చంద్రబాబు.. ఈసారి కేసీఆర్ పెట్టే ప్రెస్ మీట్ కు దేత్తడి పోచమ్మ గుడే అని అనుకుంటున్నారు రాజకీయ విశ్లేషకులు.