చేతిలో అధికారం ఉన్న వేళ.. చేయలేనిదేమీ ఉండదు. అందునా.. తిరుగులేని ముఖ్యమంత్రిగా.. ప్రజల్లో ఆదరణ జోరుగా ఉన్న వేళ.. చకచకా నిర్ణయాలు తీసుకోవటానికి ఉండే వెసులుబాటు అంతా ఇంతా కాదు. అవకాశాలు ఉన్నప్పటికీ తమ చేతిలో ఉన్న పదువుల్ని ఇచ్చేందుకు ససేమిరా అన్నట్లు వ్యవహరిస్తుంటారు. ఇలాంటి తీరు ప్రదర్శించే తెలుగు అధినేతల్లో చంద్రబాబు ముందుంటే.. అదే బాటలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పయనిస్తారన్న ఆరోపణ ఉంది. అధికారంలో లేనప్పుడు.. ఏమీ చేయలేని అశక్తతను ప్రదర్శించే చంద్రబాబు.. పవర్లోకి వచ్చిన వెంటనే నామినేటెడ్ పోస్టుల భర్తీలో విపరీతమైన ఆలస్యాన్ని ప్రదర్శిస్తారు.
ఖాళీల భర్తీపై సన్నిహితులు ఎవరైనా ప్రస్తావిస్తే.. కసరత్తు జరుగుతుందని బదిలిచ్చేవారు. అసలు కారణం ఏమంటే.. ఖాళీలకు పోటీ ఎక్కువని.. భర్తీ చేయటం షురూ చేస్తే.. వ్యతిరేకులు ఎక్కువ అవుతారన్న ఉద్దేశంతో కాలయాపన చేస్తుంటారన్న మాట వినిపిస్తూ ఉంటుంది. చేతిలో అధికారంలో లేనప్పుడు ఒకలా.. ఉన్నప్పుడు మరోలా వ్యవహరించటంలో బాబు తర్వాతే ఎవరైనా అన్న మాట తెలుగు తమ్ముళ్ల నోట తరచూ వినిపిస్తూ ఉంటుంది.
బాబు శిష్యుడిగా సుదీర్ఘకాలంగా సాగిన టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా అలాంటి అలవాటు ఉందంటారు. సుదీర్ఘకాలం ఉద్యమ పార్టీగా ఉన్న టీఆర్ఎస్ గురైన ఆటుపోట్లు అన్నిఇన్ని కావు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు అండగా ఉన్న వారికి.. తాను ఏదో ఒకటి చేస్తానని చెప్పిన కేసీఆర్.. తాను అధికారంలోకి వచ్చిన ఆరేళ్లలో భర్తీ చేయని నామినేటెడ్ పోస్టులు భారీగా ఉండిపోయాయి. ఉద్యమకాలంలో పార్టీ కోసం ఎంతో శ్రమించిన వారు.. సారు మీద నమ్మకంతో పార్టీలో చేరిన వారికి కేసీఆర్ ఏమీ చేయలేదన్న పేరుంది.
దుబ్బాక.. గ్రేటర్ ఎన్నికల్లో తగిలిన ఎదురుదెబ్బలతో సారు వాస్తవంలోకి వచ్చినట్లు చెబుతున్నారు. చేతిలో ఉన్న పదవుల పందేరానికి డిసైడ్ అయినట్లుగా చెబుతున్నారు. నాయకత్వంలో ఉత్సాహంతో పాటు.. పార్టీకోసం పని చేస్తే తప్పనిసరిగా పదవులు లభిస్తాయన్న భావన కలిగించే దిశగా కేసీఆర్ అడుగులు వేయటం షురూ చేసినట్లు చెబుతుననారు. తొలి ప్రయత్నంలో భాగంగా రాష్ట్ర మహిళా కమిషన్ ను భర్తీ చేసిన గులాబీ బాస్.. రానున్న రోజుల్లో మరిన్నికమిషన్లను ఏర్పాటు చేయటంతో పాటు కీలక పదవుల్ని ఇచ్చేందుకు సుముఖంగా ఉంటుందంటున్నారు. ఇదే మూడ్ కానీ కొనసాగితే.. గులాబీ దళానికి పదవుల పండుగ ఖాయమంటున్నారు. అధికారం చేతిలోకి వచ్చిన ఇంతకాలానికి.. చంద్రబాబు బాటను కేసీఆర్ వదిలారన్న మాట టీఆర్ఎస్ నేతల నోటి నుంచి వినిపిస్తుండటం గమనార్హం.