ఎమ్మెల్యేల‌కు కేసీఆర్ ర్యాంక్‌...కేటీఆర్ సో పూర్‌

Update: 2017-03-09 16:21 GMT
తెలంగాణ సీఎం కేసీఆర్ త‌న పార్టీ ఎమ్మెల్యేలకు పనితీరు నివేదికను ఇచ్చారు. అసెంబ్లీ స‌మావేశాల నేప‌థ్యంలో హైద‌రాబాద్ లోని తెలంగాణ భ‌వ‌న్‌లో స‌మావేశ‌మైన కేసీఆర్ శాస‌న‌స‌భా వ్యూహాల గురించి వివ‌రించారు. అనంత‌రం జిల్లాల వారిగా నేతలతో కేసీఆర్‌ సమావేశమై రెండు దఫాలుగా సర్వేలు చేయించి నివేదికను తయారు చేయించిన నివేదిక విడుద‌ల చేశారు. ఎమ్మెల్యేల పనితీరుపై సీఎం కేసీఆర్‌ నిర్వహించిన సర్వేలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు 63 శాతం పనితీరుతో ప్రథమ స్థానంలో ఉన్నారు. ఈ సర్వేలో మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి రేటింగ్‌ 96 నుంచి 58 శాతానికి పడిపోయింది.

ఇక జిల్లాల వారి ప‌నితీరులో ఎమ్మెల్యేల కేట‌గిరీలో 96.70 శాతం ప్ర‌జామోదంతో కేసీఆర్ టాప్‌ లో నిలిచారు. ఆయ‌న మేన‌ల్లుడు హ‌రీశ్ రావుకు 82.30% ఆద‌ర‌ణ ద‌క్కింది. ఇక కేసీఆర్ త‌న‌యుడు కేటీఆర్ త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గ‌మైన సిరిసిల్ల‌లో ప్ర‌జామోదం పొంద‌డంలో వెనుక‌బ‌డ్డారు. 60.40% మంది మాత్ర‌మే ఆయ‌న‌కు మ‌ద్ద‌తు ఇస్తున్నారు. అయితే గ‌త స‌ర్వేలో కేటీఆర్‌ కు స‌పోర్ట్ చేసిన వారు 70% ఉండ‌టం గ‌మ‌నార్హం. కాగా, ఖమ్మం జిల్లాలో సగటున 50 శాతం, అత్యల్పంగా వైరాలో 38 శాతం ప్రజలు టీఆర్‌ ఎస్‌ కు మద్దతు తెలుపుతున్నారని సర్వేలో వెల్లడైంది. ఇదిలాఉండ‌గా, రాబోయే ఎన్నికల్లో రాష్ట్రంలో 101-106 సీట్లు సాధిస్తామని కేసీఆర్‌ ధీమా వ్యక్తం చేశారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News