రోజూ ఆపీసుకు ఠంచనగా వచ్చి వెళ్లటం ఒక పద్ధతి. నాలుగురోజులకు ఒకసారి ఆఫీసుకు వచ్చినా.. చేయాల్సినవి.. చూడాల్సినవి మొత్తంగా పూర్తి చేయటమే కాదు.. మరో రెండు రోజుల పని కూడా పూర్తి చేసేస్తే..?ఒక ఉద్యోగి ఇలాంటివి చేసినా యజమాని ససేమిరా అనొచ్చు. కానీ.. ప్రభుత్వ పెద్దకు ఇలాంటి చిత్రమైన అలవాటు ఉంటే? ఆయన్ను ఎవరు మాత్రం ఏమనగలరు? నిత్యం ఆఫీసుకు వెళ్లే వైఖరికి భిన్నంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ లో విచిత్రమైన గుణం ఒకటి కనిపిస్తుంది.
పాలనా కేంద్రమైన హైదరాబాద్ లో పెద్దగా ఉండని ఆయన.. ఏదైనా ఇష్యూ మీద కూర్చుంటే దాని అంతు చూసే వరకూ వదిలిపెట్టరు. ఇప్పటివరకూ ఎంతోమంది ముఖ్యమంత్రుల్ని ఆర్టీసీ ఉన్నతాధికారులు చూసి ఉండొచ్చు. కానీ.. కేసీఆర్ లాంటి సీఎంను వారు చూసి ఉండరని మాత్రం కచ్ఛితంగా చెప్పొచ్చు. ఎందుకంటే.. ఆర్టీసీ మీద ఏడు గంటల మారథాన్ రివ్యూ చేసిన ఆయన.. సంస్థలోని అన్ని అంశాల్ని కూలంకుషంగా చర్చించారని చెప్పాలి. ఆర్టీసీలోని లోపాలతో పాటు.. ఏం చేస్తే బాగు పడుతుందన్న ఆలోచనల్ని ఆయన చెప్పుకొచ్చారు. ఆర్టీసీ పని తీరు ఎంత అధ్వానంగా ఉందన్న విషయాన్ని సింఫుల్ గా ఒక్క మాటలో తేల్చేశారు.
ఇందుకు ఆయన చెప్పిన మాటేమిటంటే.. ‘‘ఆర్టీసీ బస్సులు రోజుకు 34 లక్షల కిలోమీటర్లు తిరుగుతున్నాయంటే భూమి చుట్టూ 80సార్లు చక్కర్లు కొట్టినట్లు.. ఇంత తిరిగినా ఆర్టీసీకి నష్టాలు వస్తున్నాయంటే సిగ్గుచేటు. ఈ పరిస్థితి మారాలి’’ అని సూటిగా చెప్పాల్సింది చెప్పేశాడు. తీరు మారకపోతే మూసి పారేస్తానంటూ ముందు రోజు కేసీఆర్ అన్న మాటలు ఆర్టీసీ అధికారుల్లో వణుకు పుట్టించగా.. శుక్రవారం ఏడు గంటల పాటు సాగిన మారథాన్ రివ్యూ అనంతరం మాత్రం కొత్త ఉత్సాహాన్ని నింపటం ఆయనకే చెల్లుతుందేమో. గంటల కొద్దీ సాగే సమీక్షా సమావేశాలు మొదట ఉత్సాహంగా మొదలై.. గంటలు గడుస్తున్న కొద్దీ నీరసం ఆవహిస్తుంది. చివరకు.. బతకుజీవుగా అంటూ బయటపడతారు.
కానీ.. కేసీఆర్ తో రివ్యూ సమావేశాలు అందుకు భిన్నంగా ఉంటాయి. సమస్య చుట్టూ చర్చ.. అనంతరం.. వాటికి పరిష్కారాలు.. అనంతరం దిశానిర్దేశం.. భవిష్యత్ వ్యూహంతో పాటు.. భావోద్వేగ మాటలు కొత్త ఆశల్ని పుట్టించేలా చేస్తాయి. ఆర్టీసీ అధికారులతో జరిగిన చర్చ సందర్భంగా ఆయన ప్రస్తావించిన కొన్ని మాటల్ని వింటే ఇట్టే అర్థమవుతుంది. అసాధ్యమనుకున్న తెలంగాణను సాధించినప్పుడు.. ఆర్టీసీకి లాభాలు తీసుకురావటం అసాధ్యమా? అన్న సూటిప్రశ్న పట్టుదలను పెంచేదే. ఊరికే సమస్యల్ని ఎత్తి చూపటం కాకుండా ఆర్టీసీ లాభాల బాట పట్టేందుకు వీలుగా కేసీఆర్ సూచించిన సూచనలే చూస్తే.. ప్రతి డిపో నుంచి తిరుపతికి.. షిర్డీకి బస్సుల్ని నడపాలని.. పల్లెవెలుగులు చిన్న బస్సుల్లో నడపాలని.. దూరప్రాంతాలకు వెళ్లే బస్సులు ఇంటి గడప నుంచే బయలుదేరేలా చూడటం.. ఆర్టీసీలో వస్తు రవణాను మరింత ప్రోత్సహించటం.. ఛార్జీల వడ్డనలోనూ ఒక క్రమపద్ధతిని అనుసరించటం లాంటివి కొన్ని ఉదాహరణగా చెప్పొచ్చు. వీటిల్లో చాలావరకూ పక్కాగా అమలు జరిగితే నష్టాలన్నవి ఆర్టీసీ దరికి చేరవని చెప్పొచ్చు.
ఇవన్నీ ఒక ఎత్తు అయితే.. ఏడు గంటల తన సమీక్షా సమావేశంలో రాజకీయ కోణాన్ని కేసీఆర్ వదల్లేదు. ఒకవేళ అలాంటిదేమీ లేకుంటే అది కేసీఆర్ మార్క్ రివ్యూ ఎందుకు అవుతుంది? ఆర్టీసీ కార్మిక సంఘాల ఎన్నికల్ని రెండేళ్ల వ్యవధి నుంచి నాలుగేళ్లకు వాయిదా వేయించే విషయాన్ని ఎంత అలవోకగా చెప్పేశారో చూశారా? నిజానికి ఇలాంటి వ్యాఖ్యే కనుక మరో ముఖ్యమంత్రి అని ఉంటే కార్మికసంఘాలు వెనువెంటనే నిరసన వ్యక్తం చేసేవి. రెండేళ్ల నుంచి నాలుగేళ్లకు ఎన్నికల్ని పొడిగించటం ద్వారా.. ఎన్నికల రాజకీయాలు ప్రభుత్వం మీదా.. ఆర్టీసీ మీదా పడకూడదన్నదే. అదొక్కటే కాదు.. లాభాల బాట పట్టించకుండా తరచూ డిమాండ్ల సాధన కోసం సమ్మెలు చేసే అంశాన్ని ప్రస్తావిస్తూ హెచ్చరిక చేయటం గమనార్హం. కార్మికుల సమస్యల్ని పరిష్కరిస్తామంటూనే.. తమ డిమాండ్ల సాధన కోసం పోరుబాట వద్దన్న మాట కేసీఆర్ లాంటి ఉద్యమనేత నోటి నుంచి రావటమే అసలుసిసలు రాజకీయం.