అసలు విభజన సమస్యలు పరిష్కారమవుతాయా ?

Update: 2022-09-14 05:30 GMT
జరుగుతున్న వ్యవహారాలు చూస్తుంటే అసలు ఎప్పటికైనా విభజనసమస్యలు పరిష్కారమవుతాయా ? అనే సందేహాలు పెరిగిపోతున్నాయి. ఎందుకంటే రాష్ట్ర విభజన జరిగి దాదాపు ఎనిమిదన్నరేళ్ళు జరిగిపోయినా ఇంకా సమస్యలు అలాగే ఉండిపోయాయి. సమస్యల పరిష్కారాన్ని తెలంగాణా-ఏపీనే పరిష్కరించుకోవాలని చెప్పి చాలాకాలం కేంద్రప్రభుత్వం చేతులు దులిపేసుకుంది. అయితే ఈమధ్య నరేంద్రమోడీపై జగన్మోహన్ రెడ్డి పెడుతున్న ఒత్తిడి వల్ల కేంద్రంలో కాస్త కదలిక వచ్చింది.

ఈ కారణంతోనే తెలంగాణా నుండి ఏపీకి రావాల్సిన విద్యుత్ బకాయిలు సుమారు రు. 6 వేల కోట్లు 30 రోజుల్లో చెల్లించాలని కేంద్రం తెలంగాణా ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే ఏపీకి తానుగా విడుదల చేయాల్సిన నిధులను మాత్రం కేంద్రం పెద్దగా విడుదల చేయటంలేదు.

ఇదంతా ఎందుకంటే ఈనెల 27వ తేదీన కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా ఆధ్వర్యంలో రెండు రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలు, ఫైనాన్స్ తదితర ముఖ్య ఉన్నతాధికారుల సమావేశం జరగబోతోంది.

విద్యుత్ బకాయిలను తాము చెల్లించాల్సిన అవసరంలేదని పైగా ఏపీనే తమకు చెల్లించాలంటు అసెంబ్లీలోనే కేసీయార్ తేల్చేశారు. అంటే తెలంగాణా నుండి బకాయిలేవీ ఏపీకి చెల్లించే ఉద్దేశ్యంలేదని కేసీయార్ చెప్పేశారు.యూపీఏ వల్ల విభజన చట్టంలో ఏపీకి అన్నీ విధాలుగా అన్యాయం జరిగినా ఎన్డీయే దాన్ని సరిచేయటానికి ఏరోజూ ప్రయత్నించలేదు. ఈమధ్యనే రెండు రాష్ట్రాల్లోని కీలక అధికారులతో సమావేశాలు జరిగినా ఎందులోను ఎలాంటి పరిష్కారం రాలేదు.

జరుగుతున్నది చూస్తుంటే భవిష్యత్తులో కూడా ఏపీకి న్యాయం జరుగుతుందని ఎవరికీ అనిపించటంలేదు. తెలంగాణా నుంచి ఏపీకి రావాల్సినవి ఏవీ రావని తేలిపోయింది. బకాయిలు చెల్లించకపోతే తెలంగాణా ప్రభుత్వాన్ని కేంద్రం చేయగలిగేది కూడా ఏమీ లేదు.

ఇదే సమయంలో ఏపీకి తాను చేయాల్సింది కూడా కేంద్రం చేయటం లేదు. ఏపీకి న్యాయం జరగాలంటే రాజకీయ ఒత్తిళ్ళతో మాత్రమే జరుగుతుంది కానీ ఇలాంటి సమావేశాల వల్ల ఎంతమాత్రం కాదని అర్ధమైపోయింది. మరో అవకాశం ఎప్పుడొస్తుందో ?


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News