చివ‌రి ర‌క్త‌పు బొట్టు కూడా దేశానికే.. కేసీఆర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

Update: 2022-02-24 03:30 GMT
భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కర్ణాటకలో మతకల్లోలం సృష్టించారని సీఎం కేసీఆర్‌ విమర్శించారు. కులాలు, మతాల పేరిట చిచ్చుపెట్టడం మంచిదికాదని హితవు పలికారు. కేంద్రంలో ధర్మంతో పనిచేసే ప్రభుత్వం ఉండాలని... జాతీయ రాజకీయాలను ప్రభావితం చేసేలా ముందుకెళ్తున్నామన్నారు. చివరి రక్తంబొట్టు ధారపోసైనా దేశాన్ని సరైన మార్గంలో పెడతానని స్పష్టం చేశారు. దేశం దారి తప్పి పోతోందని వ్యాఖ్యానించారు. దేశంలో జుగుప్సాకరమైన పనులు జరుగుతున్నాయని ఆరోపించారు.

గత ప్రభుత్వాల కృషి వల్ల బెంగళూర్ సిలికాన్ సిటీ ఆఫ్ ఇండియా అయ్యిందని గుర్తు చేశారు. కానీ మతకల్లోల వల్ల విద్యా సంస్థలు మూత పడ్డాయని అన్నారు. కర్ణాటకలో మతకల్లోలం సృష్టించారని బీజేపీపై ప‌రోక్షంగా విమర్శించారు.

జాతీయ రాజకీయాలను ప్రభావితం చేసేలా ముందుకెళ్తున్నామని తెలిపారు. 50 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించిన  మల్లన్నసాగర్ ప్రాజెక్టును సీఎం కేసీఆర్ ప్రారంభించి.. జాతికి అంకితం చేశారు. అనంతరం బహిరంగ సభలో ప్రసంగించారు.  మల్లన్నసాగర్‌ను ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు.

తెలంగాణ ప్రజలు హర్షించదగ్గ ఘట్టం ఇదని అన్నారు. ప్రాజెక్టులను అడ్డుకోవాలని చాలా మంది ప్రయత్నించారని, ఆ కుట్రలను చేధించామన్నారు. ఇంజనీర్లు కూడా భయపడకుండా పనులు చేశారని.. ఈ సందర్భంగా వారిని అభినందిస్తున్నానని కేసీఆర్ అన్నారు.

అన్ని రంగాల్లో తెలంగాణ దూసుకెళ్తోందని సీఎం కేసీఆర్‌ వ్యాఖ్యానించారు. 24 గంటల విద్యుత్‌ అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని, రాష్ట్రం అభివృద్ధిని చూసి మహారాష్ట్ర సీఎం ఆశ్చర్యపోయారన్నారు. దేశంలో దుర్మార్గమైన పనులు జరుగుతున్నాయని పరోక్షంగా కేంద్రంలోని ప్ర‌ధాని న‌రేంద్ర‌ మోడీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. కర్నాటకలో మతకల్లోలాలకు పాల్పడుతున్నారని సీఎం కేసీఆర్‌ ఆరోపించారు.
Tags:    

Similar News