అందరూ అనుకున్నదే చేస్తే ఆయన కేసీఆర్ కానే కాదు. ఎవరూ ఊహించని రీతిలో వ్యవహరించటం ఆయన నైజం. ఇలా జరుగుతుందని అనుకుంటే.. సరిగ్గా అలా జరగకుండా చేయటం కేసీఆర్‌కు అలవాటు. తన సన్నిహితులకు సైతం కొరుకుడు పడని రీతిలో ఆయననిర్ణయాలు ఉంటాయి.
తాజాగా అలాంటి నిర్ణయాలతో అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తారు కేసీఆర్. తన మీద నిత్యం విరుచుకుపడే ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డికి కొత్త తరహాలో షాకిచ్చిన వైనం తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర చర్చగా మారింది. బుధవారం రేవంత్ బర్త్ డే. ఈ సందర్భంగా రేవంత్ కు బర్త్ డే శుభాకాంక్షలు తెలుపుతూ.. విషెస్ తో పాటు.. ఒక బొకేను పంపిన కేసీఆర్ రేవంత్ అండ్ కోకు భారీ షాక్ ను ఇచ్చారు.
గతంలో ఎప్పుడూ కూడా రేవంత్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పిన దాఖలాలు లేని కేసీఆర్.. కాంగ్రెస్ లో చేరిన తర్వాత కొత్త తరహాలో విషెస్ చెప్పటం వెనుక మతలబు ఏమిటన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. ఇటీవల కాలంలో వెల్ కం గ్రూప్ పేరుతో రెడ్లలో తీవ్ర అసంతృప్తిని రేకెత్తించటంతో పాటు.. రెడ్లను చిన్నచూపు చూస్తున్నారన్న విమర్శ పెరిగిపోతోంది.
రేవంత్ కు.. కేసీఆర్ మధ్య పొలిటికల్ వార్ జరుగుతుందన్న ప్రచారం జరుగుతున్న వేళ.. రోటీన్‌కి భిన్నంగా రేవంత్‌కు విషెస్ చెప్పటం గమనార్హం. దేవుడు మీకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలి.. మీరు ప్రజాసేవలో మరెన్నో ఏళ్ల పాటు కొనసాగాల్సి ఉందంటూ రేవంత్‌కు పంపిన లేఖలో కేసీఆర్ కోరినట్లుగా తెలుస్తోంది. బర్త్ డే రోజున కేసీఆర్ ఇచ్చిన సర్ ప్రైజ్ రేవంత్ అండ్ కోకు షాకింగ్ గా మారిందని చెబుతున్నారు.