ఈటలపై కేసీఆర్ సీరియస్.. ఎదురుదాడి

Update: 2021-05-04 07:08 GMT
భూకబ్జా ఆరోపణలతో మంత్రి పదవి నుంచి ఈటలను సీఎం కేసీఆర్ తొలగించారు. అయితే ఈ పరిణామం అనంతరం   ఈటల మీడియా ముందుకు వచ్చి రచ్చ చేస్తున్నారు. ‘తెలంగాణ తెచ్చింది ఒక్క కేసీఆర్ కుటుంబం కోసమేనా?’ అని తీవ్ర విమర్శలు చేశారు.

ఈటల వ్యవహారంపై ఇన్నాళ్లు గమ్మున ఉన్న టీఆర్ఎస్ నేతలు.. సీఎం కేసీఆర్ తాజాగా సీరియస్ అయ్యారు. తనపై ఎదురుదాడి చేయడంతో పార్టీ పరంగా తీసుకోవాల్సిన చర్యలపై సీనియర్ నేతలతో తాజాగా మంతనాలు జరిపారు.

దీంతో ఈటల వ్యవహారంపై టీఆర్ఎస్ క్రమశిక్షణ సంఘం దృష్టి సారించినట్లు సమాచారం. పార్టీ పరంగా ఈటల రాజేందర్ పై చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఇక కేసీఆర్ సీరియస్ కావడంతో గులాబీ శ్రేణులు కూడా ఈటలపై ఎదురుదాడి మొదలుపెట్టాయి. ఈటల రాజేందర్ వ్యవహారంపై తొలిసారి అదే కరీంనగర్ జిల్లాకు చెందిన దళిత మంత్రి కొప్పుల ఈశ్వర్ స్పందించారు. ఈటలకు గౌరవం దక్కలేదన్నది అవస్తవమన్నారు. సీఎంపై ఆరోపణలు చేయడం క్రమశిక్షణా రాహిత్యమన్నారు. సందర్భం వచ్చినప్పుడల్లా పార్టీకి, కేసీఆర్ కు వ్యతిరేకంగా మాట్లాడారని తెలిపారు. పార్టీలో ఈటల చేరకముందే ఉద్యమం ఉధృతంగా ఉందని మంత్రి ఈశ్వర్ స్పష్టం చేశారు.

ఇలా ఈటలపై టీఆర్ఎస్ దాడి మొదలైంది. ఇక ఈటల కూడా టీఆర్ఎస్ సర్కార్ చేసిన కబ్జా ఆరోపణలపై హైకోర్టుకు ఎక్కారు.
Tags:    

Similar News