అనుభవంతో చెప్పే మాటల్ని ఎంత త్వరగా అవగాహన చేసుకుంటే అంత మంచిది. అలాంటి విషయాలు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు తెలీనివి కావు. కానీ.. కొన్నిసార్లు తెలిసిన విషయాల్ని మర్చిపోతుంటారు కదా. కరోనా విషయంలో సారు అలాంటి తీరునే ప్రదర్శిస్తున్నారు. తనకు బాగా అలవాటైన ‘చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలనే’ వైనాన్ని కరోనా విషయంలో అసలు అప్లై చేయని తీరుపై విస్మయం వ్యక్తమవుతోంది.
దేశంలో అందరి కంటే ముందు లాక్ డౌన్ ప్రకటించిన ముఖ్యమంత్రిగా.. లాక్ డౌన్ వేళ బయటకు వస్తే షూట్ చేసే అవకాశం ఉందన్న ఘాటు వార్నింగ్ ఇచ్చిన సీఎంగా ఆయనకు పేరుంది. మిగిలిన ముఖ్యమంత్రులకు భిన్నంగా తరచూ ప్రెస్ మీట్లు పెట్టి.. గంటకు పైనే మాట్లాడుతూ.. అందరిలోనూ భరోసా నింపే కేసీఆర్.. గడిచిన కొద్ది రోజులుగా మీడియా సమావేశాన్ని నిర్వహించటమే మానేశారు.
దేశంలోని పలు రాష్ట్రాల్లో పాజిటివ్ కేసులు పెద్ద ఎత్తున నమోదవుతున్న వేళ.. తెలంగాణలో మాత్రం పరిమితంగానే కేసులు నమోదయ్యేస్థాయి నుంచి రోజుకు వెయ్యిపైనే కేసులు నమోదయ్యేవరకూ తీసుకొచ్చిన వైనంతో తెలంగాణ ప్రజల గుండెల్లో ఇప్పుడు రైళ్లు పరిగెడుతున్నాయి. ఇలాంటివేళ.. రానున్న పాడు రోజుల్ని తప్పించుకోవాలంటే ఏం చేయాలన్నదిప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
ఇలాంటివేళ ఢిల్లీ రాష్ట్ర ముఖ్యమంత్రి కేజ్రీవాల్ చెప్పిన ఐదు ఆయుధాల్ని వెంటనే వినియోగించాల్సిన అవసరం ఉందని చెప్పక తప్పదు. కరోనాపై పోరాడేందుకు అవసరమైన ఐదు ఆయుధాలంటూ కేజ్రీ చెప్పిన మాటలు అక్షర సత్యాలని నిపుణులు పేర్కొంటున్నారు. ఆసుపత్రుల్లో బెడ్లు పెంచటం.. టెస్టింగ్ -ఐసోలేషన్.. ఆక్సీమీటర్ల పంపిణీ.. ప్లాస్మా థెరఫీ.. ఇంటింటి సర్వే - స్క్రీనింగ్ పరీక్షలనే ఐదు అంశాల్ని ఆయుధాలుగా చేసుకోవాలని.. ఆప్పుడు మాత్రమే కరోనాపై బలంగా పోరాటం చేయగలుగుతామని చెబుతున్నారు.
తెలంగాణ విషయానికి వస్తే.. కేజ్రీ పేర్కొన్న ఏ ఆయుధాన్ని బలంగా వినియోగించే పరిస్థితి లేదన్న విషయం తెలిసిందే. గతంతో పోలిస్తే ఢిల్లీలో నిర్దారణ పరీక్షలు నాలుగు రెట్లు పెంచినట్లుగా ఢిల్లీ ముఖ్యమంత్రి పేర్కొన్నారు. రోజుకు 20వేల పరీక్షలు నిర్వహిస్తున్నట్లు చెప్పిన ఆయన.. ఇప్పటివరకూ ఢిల్లీలో 4.59లక్షల నిర్దారణ పరీక్షలు చేసిన వైనాన్ని గుర్తు చేశారు. ఈ అంకెల్ని చూస్తే.. తెలంగాణలో ఇన్ని పరీక్షలు జరపాలంటే మరెన్ని నెలలు పడుతుందో చెప్పలేని పరిస్థితి. కేసుల నమోదు అంతకంతకూ పెరుగుతున్న వేళ.. ఢిల్లీ సీఎం చెప్పినట్లుగా ఐదు ఆయుధాల్ని అర్జెంట్ గా సిద్ధం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నది మర్చిపోకూడదు. మరి.. కేసీఆర్ ఎలా స్పందిస్తారో చూడాలి.