తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు శైలే విభిన్నం. వాస్తవ అవసరాల కంటే తను తలిచినపుడే అనుకున్న పని చేస్తారు. ఇన్నాళ్లుగా మహిళలకు ప్రాధాన్యం దక్కడం లేదనే విమర్శలు పెద్ద ఎత్తున వ్యక్తమవుతున్నప్పటికీ లైట్ తీసుకున్న కేసీఆర్ తాజాగా మహిళలకు నామినేటెడ్ పదవుల్లో భాగస్వామ్యం కల్పించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ ప్రాధాన్యం ఇవ్వడం వెనుక ఆయన లెక్కలు వేరే ఉన్నాయంటున్నారు. ఎన్నికలకు రెండేళ్ల సమయం ఉన్నప్పటికీ ఇప్పటికే అలాంటి మూడ్ ను సృష్టించడంలో సఫలమైన కేసీఆర్ తన గెలుపునకు ఏ ఒక్క కారణం అడ్డుగా ఉండవద్దని భావిస్తున్నారట. అందులో భాగమే ఈ నిర్ణయమని సమాచారం.
ఇందులో భాగంగానే అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రగతిభవన్ లో మహిళలతో సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పరిపాలనలో మహిళల భాగస్వామ్యం పెంచడం- తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసిన మహిళలకు నామినేటెడ్ పదవులు, మహిళాభ్యుదాయానికి కృషి చేసిన వారిని గుర్తించి నామిటేడ్ పదవులు ఇవ్వాలని నిర్ణయించారు. వివిధ కార్పొరేషన్లతో పాటు ఇతర నామినేటెడ్ పదవులకు అర్హులైన మహిళలను ఎంపిక చేయడానికి డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి - కరీంనగర్ జడ్పీ చైర్ పర్సన్ తుల ఉమ - నిజామాబాద్ ఎంపీ కవితతో కలిసి త్రిసభ్య కమిటీని నియమించారు. కమిటీ సూచనల మేరకు త్వరలోనే పదవులు ఇస్తామన్నారు. మహిళల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటున్నదని, ఈ ఏడాది నుంచి కొత్త కార్యక్రమాలు కూడా చేపట్టనున్నట్టు కేసీఆర్ తెలిపారు. ప్రభుత్వ కార్యక్రమాలను ఉపయోగించుకుని మహిళలు అన్ని రంగాల్లో ముందంజ వేయాలని సీఎం సూచించారు.
తెలంగాణ మహిళా శాసనసభ్యులకు మంత్రివర్గంలో చోటన్నది 'అందని ద్రాక్ష'గా మారిన నేపథ్యంలో తాజాగా, భారీగా ప్రకటించిన కార్పొరేషన్ పదవుల పందేరాల్లోనూ రాష్ట్ర ప్రభుత్వం వారికి మొండి చెయ్యి చూపడం పలు వర్గాలకు విస్మయం కలిగించింది. ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భావం అనంతరం మహిళలకు ప్రాతినిధ్యం లేకుండానే మంత్రివర్గం ఏర్పాటైంది. దాంతో అప్పట్లోనే అందరూ విస్తుబోయారు. అయితే కొత్త రాష్ట్రంలో పరిమిత మంత్రిపదవులు మాత్రమే అందుబాటులోకి రావడంతో వారికి ప్రాతినిధ్యం కల్పించలేకపోయినట్టు అధికార టీఆర్ ఎస్ వర్గాలు సంజాయిషీ ఇచ్చుకున్నాయి. అయితే దాన్ని సరిదిద్దేందుకు గాను నామినేటెడ్ పదవులకు అర్హులైన మహిళలను ఎంపిక చేసి నివేదిక అందజేయాల్సిందిగా ఓ కమిటీని కేసీఆర్ రూపొందించారు. పరిపాలనలో మహిళల భాగస్వామ్యం పెంచడం తో పాటు, తెలంగాణ ఉద్యమంలో కీలకంగా మహిళలకు నామినేటెడ్ పదవులుపని చేసిన వారిని, మహిళాభ్యుదాయానికి కృషి చేసిన వారిని గుర్తించి నామిటేడ్ పదవులు ఇవ్వాలని నిర్ణయించారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/