ముఖ్యమంత్రిగా తన హోదాను ప్రదర్శించే తెలంగాణ సీఎం కేసీఆర్.. అవసరానికి తగ్గట్లుగా ఇట్టే మారిపోతారు. జనంలో ఒకడిగా కలిసిపోయే ఆయన.. తన కోసం వచ్చే విపక్ష నేతల్ని కలుసుకోవటానికి సైతం ససేమిరా అనే ఆయన.. సామాన్యుడి పక్కనే కూర్చొని కులాసా కబుర్లు చెప్పటమే కాదు.. వారితో కూర్చొని సహపంక్తి భోజనాలు చేసేందుకు పెద్దగా మొహమాట పడరు.
అంతేకాదు.. అందరితో కలిసిపోయే తీరు సామాన్యుల్ని విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఇక.. కేసీఆర్ మాటల మాయజాలం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు.
తాజాగా కరీంనగర్ ముల్కనూరు గ్రామంలో ఏర్పాటు చేసిన సభలో మాట్లాడిన సందర్భంగా కేసీఆర్ ఆసక్తికర విషయాల్ని చెప్పుకొచ్చారు. ఈ నెల 12న చిన్న ములక్కనూర్ లో గ్రామజ్యోతి కార్యక్రమంలో మొదలుపెడదామని చెప్పిన ఆయన.. తాను ఆ రోజు గ్రామానికి వస్తానని చెప్పారు.
గ్రామంలో 2500జనాభా ఉందని.. ఇంటికి ఒకరు చొప్పున 1500 మంది రావాలని.. అందరూ తమతో తట్ట.. గడ్డపార పట్టుకొని శ్రమదానం చేద్దామన్నారు. తానూ వచ్చి 50 తట్టల మట్టి మోస్తానని.. మోరీలో మట్టి తీసేందుకు సైతం వెనుకాడనని చెప్పారు. ఆ రోజు జరిగే కార్యక్రమం అయిన తర్వాత తన సొంత డబ్బులతో భోజనం పెట్టిస్తానని.. ఊళ్లో కూలిన 200 ఇళ్ల స్థానంలో 200 డబుల్ బెడ్ రూం ఇళ్లు కట్టిస్తానని చెప్పారు. మెడకు కట్టుకున్న పాము కుట్టక మానదని.. తాను దత్తత తీసుకున్న గ్రామం అభివృద్ధి చెందేవరకూ తాను వెంటే ఉంటానని చెప్పారు.
అంతేకాదు.. గ్రామంలోని పనులు చేసేందుకు నిధుల గురించి ఉండే చింతను సీఎం సులువుగా తీర్చేవారు. 12న నిర్వహించే కార్యక్రమం అనంతరం ఊరికి కావాల్సిన పనులు చేసుకోవటం కోసం రూ.50లక్షల నిధులు ఇస్తానని.. గ్రామ జ్యోతి పథకం కింద రూ.కోటి ఇస్తానని చెప్పిన కేసీఆర్.. మీరెంత ఇస్తారని ఎంపీని అడిగిన వెంటనే.. స్పందించిన వినోద్ తాను రూ.25 లక్షలు (ఎంపీ నిధులు).. ఎమ్మెల్యే రూ.10లక్షలు.. జిల్లా కలెక్టర్ రూ.15 లక్షలు ఇస్తామని ప్రకటించారు. దీంతో.. కేసీఆర్ స్పందిస్తూ.. మీ ఊరుకు అదృష్టం కలిసి వచ్చిందని వ్యాఖ్యానించారు.
అయినా.. ముఖ్యమంత్రి నోరు తెరిచి అడిగిన తర్వాత.. తమ వద్దనున్న ఫండ్ ను ఎవరు మాత్రం ఇవ్వమని చెబుతారు..? మొత్తంగా కేసీఆర్ పుణ్యమా అని చిన్న ముల్కనూర్ సుడి తిరిగిపోయిందని చెప్పక తప్పదు.