‘‘చాలా కష్టపడి 15 ఏళ్లు సుదీర్ఘ పోరాటంతో రాష్ట్రం తెచ్చుకున్నాం. ఇప్పుడిప్పుడే నిలదొక్కుకొని ప్రయాణం ప్రారంభించాం. ఈ సమయంలో గ్రేటర్ ఎన్నికలు వచ్చాయి. దయచేసి జాగ్రత్తగా ఆలోచించి ఓటు వేయండి. దారుణమైన విషయం ఏమిటంటే 2001లో ఉద్యమం ప్రారంభిస్తే.. 2004కు వచ్చేసరికి ఫలితం వచ్చింది. రాష్ట్రంలో.. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. తెలంగాణను నేను కూడా ఢిల్లీకి తీసుకుపోయాను. అప్పట్లోనే హైదరాబాద్ పై రాజీ పడతారా? తెలంగాణను తొందరగా ఇచ్చేస్తాం అని చెప్పారు. ఈ విషయం డీఎస్.. ఇతర మంత్రులు.. ఉద్యమకారులకు తెలుసు. నేను ఏకొద్దిగా రాజీ పడినా 2006.. 2007లోనే తెలంగాణ వచ్చేది. నా ప్రాణం పోయినా సరే.. గుండెకాయ లేని మొండెం ఇస్తామంటే సిద్ధంగా లేమని చెప్పా. హైదరాబాద్ తో కూడిన తెలంగాణ ఇవ్వాలని డిమాండ్ చేశాం. హైదరాబాద్ పై సర్వ హక్కులూ తెలంగాణకే ఉండాలని పట్టుబట్టినం. దానితోనే రాష్ట్రాన్ని తీసుకురావటానికి పద్నాలుగున్నరేళ్లు పట్టింది’’
‘‘పరాయి రాష్ట్రానికి వచ్చిన చంద్రబాబు హైదరాబాద్ కు వచ్చి చక్కిలిగింతలు పెడుతున్నాడు. బల్దియా ను అభివృద్ధి చేయటానికి ఆయన చేతిలో నెత్తుందా? కత్తుందా? ఏముంది?’’
‘‘హైదరాబాద్ విశ్వనగరం కావాలి. అమెరికాలో డల్లాస్ కంటే గొప్పది కావాలి. కేసీఆర్ మొండోడు. అన్నది తప్పకుండా చేస్తాడు’’
‘‘ఏపీలో ఒక్కరికి నాలుగుకిలోల బియ్యం పంపిణీ చేస్తుంటే.. మన దగ్గర ఆరిస్తున్నం. తెలంగాణ వస్తే చిమ్మచీకటి అవుతుందన్నరు. ఇప్పుడు ఏమయ్యింది మరి 24 గంటల పాటు కరెంట్ ఇస్తున్నం. 18 నెలల్లో 190 సంక్షేమ కార్యక్రమాల్ని చేపట్టాం. హైదరాబాద్ లోని ప్రతీ నిరుపేదకు ఇల్లు ఇచ్చే బాధ్యత నాదే. మీ బిడ్డ కేసీఆర్ గా చెబుతున్నా. తెలంగాణ వచ్చింది కాబట్టే ఇన్ని పథకాలు సాధ్యమవుతున్నాయి’’
‘‘ఈ ఎన్నికల కోసం నా కొడుకు కేటీఆర్ నగరమంతా తిరిగాడు. పార్టీ ప్రచార బాధ్యతను భుజాలకెత్తుకుని నడిపించాడు. నగరాన్ని అభివృద్ధి చేసేందుకు నా వద్దనున్న మున్సిపల్ శాఖను ఆయనకు అప్పగిస్తా’’
‘‘నాకు నిన్నటి నుంచి రంది పట్టుకుంది. నాకో మంచి దోస్తు ఉన్నడు. సీపీఐ నారాయణ. జీహెచ్ఎంసీ లో టీఆర్ఎస్ ఒంటరిగా మేయర్ పీఠం గెలుచుకుంటే చెవులు కోసుకుంటా అన్నరు. నారాయణ గారూ.. మీరు ఐదో తేదీన హైదరాబాద్ లో ఉండకండి. ఎవరన్నా చెవులు కోస్తే మళ్లీ మేమే ఈఎన్ టీలో ఆపరేషన్ చేయించాలి. ఇదివరకే ఓసారి గాంధీ జయంతిన చికెన్ తిని.. తప్పు ఒప్పుకొని ఏడాది పాటు చికెన్ కు దూరం అయ్యిండు. అయినా.. చెవులు కోసుకోవటం ఏమిటి?’’’
‘‘ఇదే ముఠా వరంగల్ కు వచ్చి తొడలు కోసుకుంటా. మెడలు కోసుకుంటా అని సవాలు విసిరారు. కానీ.. వరంగల్ ప్రజలు దంచుడు దంచితే అడ్రస్ లేకుండా పోయారు’’
‘‘ఎవరిది కోయాలో.. ఏం కోయాలో ప్రజలు ఫిబ్రవరి 2వ తేదీన డిసైడ్ చేస్తరు’’
‘‘చంద్రబాబు.. బీజేపీ కలిసి ఏం చేశాయి? రాష్ట్రం ఏర్పడగానే ఖమ్మం జిల్లాలో ఏడు మండలాలు గుంజుకున్నరు. అందుకోసం ఓటేయాలా? గుంజుకుంది చంద్రబాబు నాయుడైతే గుంజిచ్చింది వెంకయ్యనాయుడు’’
‘‘బీజేపీ.. టీడీపీ నేతలు కలిసి ప్రచారంలో అవాకులు చవాకులు పేలుతున్నరు. దత్తాత్రేయ పెద్దమనిషి అనుకున్న. ఆయన కూడా అబద్ధాలు ఆడుతున్నడు. కేంద్రం ఇచ్చే నిధులతో డబుల్ బెడ్రూం ఇళ్లు కట్టిస్తున్నారని అంటున్నాడు. దేశంలో ఎక్కడన్నా ఈ స్కీమ్ ఉందా? బీజేపీ పాలిత గుజరాత్.. రాజస్థాన్.. మహారాష్ట్ర.. మధ్య ప్రదేశ్.. చత్తీస్ గఢ్ లో ఉందా? ప్రెస్ మీట్ పెట్టి ఈ విషయం చెప్పాలి. నగరంలో నువ్వు కలసి తిరిగి ప్రచారం చేసిన చంద్రబాబునాయుడు సీఎంగా ఉన్న ఏపీలో ఈ స్కీమ్ ఉందా?’’
‘‘చంద్రబాబూ.. వాస్తవం తెలియక మాట్లాడుతున్నావు. నేను అమరావతిలో ఉంటానంటే కుదురుద్దా? ఒక ఊరి పటేల్ మరో ఊరికి మస్కూరు. విజయవాడకు పోయి హైదరాబాద్ లో ఉండబుద్ధి కావటం లేదంటవు. హైదరాబాద్ లో ఉండి పని చేయాలంటే విదేశంలో ఉండి పని చేస్తున్నట్లు ఉందంటవు. వీసా కావాలంటవు. హైదరాబాద్ మీద ప్రేమ ఉంది. విజయవాడ నుంచి అరగంటలో వస్తనంటవు. కృష్ణా.. గోదావరి తాగునీరు తెస్తమంటే మాత్రం పంచాయితీ పెడతవ్’’