తెలంగాణలో రెప్పపాటున కూడా కరెంటు పోనివ్వం పంటలనే కాదు పరిశ్రమలను కాపాడుకుంటాం అని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు అన్నారు. హైదారబాద్ శివార్లలోని కొంగరకలాన్ లో జరిగిన ప్రగతి నివేదన సభలో మాట్లాడిన కేసీఆర్ దేశ వ్యాప్తాంగా రైతులకు 24 గంటల పాటు ఉచిత విద్యుత్ ఇస్తున్నది తామేనన్నారు. సమైక్యరాష‌్ట్రంలో రైతులు ఇబ్బందులు పడ్డారని, 2000 సంవత్సరంలో ఆనాటి ముఖ్యమంత్రి విపరీతంగా విద్యుత్ చార్టీలు పెంచారని చెప్పారు. దీనిపై ముఖ్యమంత్రికి ఆనాడే తాను బహిరంగ లేఖ రాసానని అయితే ఆయన నుంచి ఎటువంటి స్పందన రాలేదని పేర్కొన్నారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యామానికి ఆ రోజే నాంది వాచనం పలికిందని పేర్కొన్నారు. ఆనాటి ముఖ్యమంత్రి కేంద్రంలో ప్రభుత్వాని శాసిస్తున్నారని, దీంతో తాను రాసిన లేఖను పట్టించుకోలేదని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు. ఆనాడే తెలంగాణ రాష్ట్రం కోసం తాను ఎక్కని కొండ, మొక్కని దేవుడూ లేడని సీఎం పేర్కొన్నారు. తెలంగాణ సాధన కోసం ప్రజలందరూ ఉద్యమించారని, ఢిల్లీ పెద్దలు మాత్రం దీని కాలరాయలుకున్నారు. "ఆనాడు నా వెంట పిడికెడు మంది ఉన్నారు. వారితోనే ఎత్తిన జెండా దించను. తెలంగాణ తీసుకురాకపోతే రాళ్లతో కొట్టి చంపండి" అని ప్రకటించానని అన్నారు. తనను చూసి కమ్యునిస్ట్ పార్టీ నాయకులు పిచ్చివాడన్నారని, ఓ పార్టీ చుట్టూ ప్రత్యేక తెలంగాణ చుట్టూ ప్రత్యేక తెలంగాణ కోసం మద్దతు ఇవ్వాల్సిందిగా 36 సార్లు తిరిగానని ముఖ్యమంత్రి చెప్పారు. సమైక్య రాష్ట్రంలో కులవ్రుత్తులు ధ్వంసమయ్యాయన్నారు.
రెండు గంటలు ఆలస్యంగా వచ్చిన ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ప్రగతి నివేదనను ఆనాటి ఉద్యమంతో ప్రారంభించారు. ఆ ప్రసంగానికి ముందు రంగారెడ్డి జిల్లాకు చెందిన మంత్రి మహేంద్ర రెడ్డి ఆహ్వానం పలికారు. కేవలం ఒక నిమిషం మాట్లాడిన మహేంద్ర రెడ్డి రాజకీయ, అభివ్రుద్దికి సంబంధించిన అంశాలేవీ ప్రస్తావించలేదు. ఆయన తర్వాత పార్టీ సెక్రెటరీ జనరల్ కె. కేశవ రావు రెండు నిమిషాలు ప్రసంగించారు. తన ప్రసంగంలో మరో పది సంవత్సారాల పాటు కె. చంద్రశేఖర రావు ముఖ్యమంత్రి గా ఉండాలని ఆకాంక్షించారు. ఆయన తర్వాత తెలంగాణ ఉపముఖ్యమంత్రులు కడియం శ్రీహరి - మహామూద్ ఆలీ చెరోకరు నిమిషం పాటు మాత్రమే మాట్లాడారు. దీంతో ఈ సభలో కేసీఆరే వన్ మ్యాన్ షోగా వ్యవహరించారు.