కేసీఆర్ కారు మ‌ళ్లీ ఆగింది.. ఎందుకంటే?

Update: 2017-10-11 10:32 GMT
అత్యున్న‌త స్థానాల‌కు ఎదిగినా చాలామంది ఒదిగే ఉంటారు. నిజానికి అదే వారికి శ్రీరామ‌ర‌క్ష‌. రాజ‌కీయంగా త‌న ప్ర‌త్య‌ర్థుల‌పై తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డి.. ఇష్టారాజ్యంగా తిట్టేయ‌ట‌మే కాదు.. బూతులు కూడా అన‌ర్గ‌ళంగా తిట్టేయ‌గ‌ల స‌మ‌ర్థ‌త తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ కు మాత్ర‌మే సాధ్యం. తాజాగా ఆయ‌న తెలంగాణ రాష్ట్ర ఉద్య‌మ నేత‌ల్లో ప్ర‌ముఖుడైన కోదండ‌రాంను ఎంత‌లా తిట్టేశారన్న‌ది తెలిసిందే.

కోదండ‌రాంను తిట్టేసిన కేసీఆర్ తీరును చూసి చాలామంది ఆయ‌న ప‌ట్ల నెగిటివ్ వ్యాఖ్య‌లు చేయ‌టం క‌నిపించింది.అదే క్ర‌మంలో అధికారంలో కేసీఆర్ త‌ల‌కు ఎక్కింద‌ని.. ఇప్పుడు ఆయ‌నకు ఎవ‌రూ క‌నిపించ‌టం లేద‌న్న మాట అనేసినోళ్లు ఉన్నారు.

ఇలాంటి నెగిటివ్ ప్ర‌చారాన్నిపాజిటివ్‌ గా మార్చుకోవ‌టం సీఎం కేసీఆర్‌ కు అల‌వాటే. ఏ చిన్న అవ‌కాశం చిక్కినా పూర్తిస్థాయిలో త‌న స‌త్తాను ప్ర‌ద‌ర్శించే కేసీఆర్‌.. తాజాగా మ‌రో నాట‌కీయ స‌న్నివేశానికి పాత్ర‌ధారి అయ్యారు. సీఎం కుర్చీలో కూర్చున్న త‌న‌కు ప‌వ‌ర్ మ‌త్తు త‌ల‌కు ఎక్కింద‌ని విమ‌ర్శించే వారు ఆత్మ‌శోధ‌న‌లో ప‌డేలా కేసీఆర్ వ్య‌వ‌హ‌రించి ప‌లువురి మ‌న‌సుల్ని దోచుకున్నారు.

రాష్ట్రానికి తిరుగులేని సీఎం అయినా.. త‌న చిన్న‌నాటి స్నేహితుల‌కు.. ప‌రిచ‌య‌స్తుల‌కు తాను నాటి మ‌నిషినేన‌న్న భావ‌న క‌లిగేలా చేశారు. తాజాగా జిల్లా స‌మీకృత కార్యాల‌యాల శంకుస్థాప‌న కోసం ముఖ్య‌మంత్రి కేసీఆర్ సిద్దిపేట జిల్లాకు బ‌య‌లుదేరారు. ఆయ‌న కాన్వాయ్ జెట్ స్వీట్ లో వెళుతున్న వేళ‌.. ములుగు జాతీయ ర‌హ‌దారి ద‌గ్గ‌ర‌కు వ‌చ్చేస‌రికి త‌న కాన్వాయ్‌ ను నిలిపివేశారు.

అక్క‌డ త‌న బాల్య మిత్రులు జ‌హంగీర్‌.. అంజిరెడ్డిల‌ను అప్యాయంగా ప‌లుక‌రించారు. కాసుపు మాట్లాడిన ఆయ‌న వారిని త‌న వాహ‌నంలోకి ఎక్కించుకొని త‌న‌తో తీసుకెళ్లారు.క‌ల‌లో కూడా ఊహించ‌ని రీతిలో కేసీఆర్ రియాక్ట్ కావ‌టంతో చిన్న‌నాటి మిత్రుల‌కు..అక్క‌డి గ్రామ‌స్థుల ఆశ్చ‌ర్యానికి.. ఆనందానికి హ‌ద్దే లేకుండాపోయింది. కేసీఆర్ అంటే అదే మ‌రి.
Tags:    

Similar News