తెలంగాణలో మంత్రులు కొలువుదీరారు. బాధ్యతలు చేపట్టారు. కానీ వారి పాలన వ్యవహారాలు చూసే పీఆర్వోలను తెలంగాణ ప్రభుత్వం ఇంకా కేటాయించలేదట.. గత ప్రభుత్వంలో కూడా మంత్రుల విషయంలో సీఎం కేసీఆర్ పేషీ ఇలానే వ్యవహరించింది. ఇప్పుడు కూడా మంత్రులకు పీఆర్వోల నియామకాన్ని సైతం సీఎం పేషీ తన చేతుల్లోకి తీసుకున్నట్టు సమాచారం.
దీన్ని బట్టి మంత్రులుగా నియామకమైన నేతలు డమ్మీలుగా మిగిలిపోతున్నారు. తమ తమ శాఖల పరిధిలో ఎలాంటి నిర్ణయాధికారులు మంత్రులు తీసుకోవడానికి లేకుండా పోతోంది. అంతా సీఎం కేసీఆర్ కనుసన్నల్లోనే జరగబోతోందని అర్థమవుతోంది. కనీసం సొంతంగా పీఆర్వోలను కూడా నియమించుకోలేని దయనీయ స్థితిలో తెలంగాణ మంత్రులున్నారంటే వారి పదవులు నామ్ కే వాస్తే అన్నది అర్థమవుతోంది.
ఇప్పటికే గత మంత్రుల హయాంలో పీఎస్ ల నియామకాన్ని సీఎంవో ఆఫీసు తమ చేతుల్లోకి తీసుకుంది. ఇప్పుడు పీఆర్వోల నియామకాన్ని కూడా ప్రభుత్వం లాగేసుకొని ఓ ప్రైవేటు సంస్థకు అప్పగించినట్లు తెలుస్తోంది. వాళ్లే ఇప్పుడు మంత్రులకు పీఆర్వోలను సరఫరా చేస్తారని తెలుస్తోంది.
గత ప్రభుత్వ హయాంలో మంత్రుల పేరు చెప్పి పీఆర్వోలు భారీ ఎత్తున సెటిల్ మెంట్లకు దిగడంతో మంత్రులతోపాటు ప్రభుత్వం ఆభాసుపాలైంది. ఈ నేపథ్యంలో పీఆర్వోల వ్యవస్థను ప్రక్షాళన చేసేందుకే సీఎం కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు అధికార వర్గాలు చెబుతున్నాయి. పీఆర్వోల నియామకాలను అవుట్ సోర్సింగ్ ద్వారా భర్తీ చేయాలని కేసీఆర్ తీసుకున్న నిర్ణయం తెలంగాణలో కార్పొరేట్ పాలనకు తెరతీసినట్టని భావిస్తున్నారు.
అయితే సీఎంవో నియమిస్తున్న అవుట్ సోర్సింగ్ పీఆర్వో సదురు మంత్రుల మాట వింటారా లేదా అన్నది ఆమాత్యులను కంగారు పెడుతోంది. వారు కూడా అవినీతికి పాల్పడితే నియంత్రించడం ఎలా అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. దీన్ని బట్టి మంత్రులకు ఏ స్వేచ్ఛ లేకుండా చేయడానికే కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. రాష్ట్రంలో మంత్రుల పేషీల్లో అంతా కార్పొరేట్ పాలననే కొనసాగేలా కేసీఆర్ తీసుకున్న ఈ నిర్ణయంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఇక పీఆర్వోలనే కట్టడి చేయలేని స్థితిలో ఉండే మంత్రులు సంబంధిత అధికారులను ఎలా కట్టడి చేస్తారన్న ప్రశ్న తెలంగాణ ప్రభుత్వంలో చర్చకు వస్తోంది. పీఆర్వోల అవినీతి బూచి చూపి మంత్రులపై నిఘా పెట్టేందుకే కేసీఆర్ ఈ కార్పొరేట్ సిస్టంను తెరపైకి తెచ్చాడని తాజా పరిణామాల బట్టి అర్థమవుతోంది.