తెలంగాణ సీఎం కేసీఆర్.. ఆర్థిక సమస్యలతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఆదాయ వ్యయాలకు మధ్య పొంతన లేకపోవడంతో కేసీఆర్ ప్రభుత్వం ఇబ్బందుల పాలవుతోంది. ముఖ్యంగా కరోనా దెబ్బతో హైదరాబాద్ నుంచి వచ్చే ఆదాయం సగానికి సగం గత ఆర్థిక సంవత్సరంలో నష్టపోయారు. ఇదే సమయంలో మూడు ఉప ఎన్నికలు ఒకే ఏడాది రావడం(దుబ్బాక, హుజూరాబాద్, సాగర్)తో ఖర్చు ఊహించని విధంగా పెరిగిపోయింది. ఇక, సాధారణంగా.. ఉండే ఖర్చులు సరేసరి! పైగా కేసీఆర్ చేతికి ఎముక లేదనే టాక్ ఎలానూ ఉంది. ఈ నేపథ్యంలో ఆర్థికం మరింత ఇబ్బంది పెడుతోంది. దీంతో పథకాల అమలు.. సంక్షేమం.. వంటివాటికి కేటాయింపులు జరిపేందుకు నానా తిప్పులు పడుతున్నారు.
ఈ క్రమంలోనే అదనపు ఆదాయ సమీకరణకు కేసీఆర్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్న విషయం తెలిసిందే. అయితే.. ప్రజలపై భారాలు మోపకుండానే.. ప్రభుత్వం పరిధిలో నిరర్ధకంగా ఉన్న ఆస్థులను విక్రయించేందుకు కొన్నాళ్లుగా ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే హైదరాబాద్ శివారులోని కోకాపేటలో ఉన్న సర్కారు భూములను అమ్మకానికి పెట్టాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. అందులో భాగంగా.. భూములు, ఆస్తుల వివరాలు, వాటిని అమ్మితే వచ్చే రాబడిపై లెక్కలు తీసేందుకు రెవెన్యూ, హౌసింగ్, హెచ్ఎండీఏ ఆఫీసర్లతో ఇటీవల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ సమీక్ష నిర్వహించారు.
2021 22 బడ్జెట్లోనే ప్రభుత్వ భూములు, ఆస్తులు అమ్ముతామని రాష్ట్ర ప్రభుత్వం కొన్నాళ్ల కిందటే ప్రకటించింది. ఈ క్రమంలో దీనికి సంబంధించిన.. క్రతువును ఆఘమేఘాలపై పూర్తి చేశారు. తాజాగా హౌసింగ్ భూములను అమ్మకానికి పెట్టాలని నిర్ణయించింది. తద్వారా రాష్ట్ర ఖజానాకు దాదాపు 10 వేల కోట్ల రూపాయల ఆదాయాన్ని సమకూర్చుకోవాలని భావిస్తోంది. ప్రభుత్వ భూముల అమ్మకానికి హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఈ భూముల విక్రయానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆన్‌లైన్ ద్వారా ఈ భూముల విక్రయాన్ని జరపాలని నిర్ణయించింది. భూముల విక్రయానికి సంబంధించిన బాధ్యతలను హెచ్ఎండీఏకు అప్పగించారు.
వాస్తవానికి తెలంగాణ సర్కారు భూములు విక్రయించడం ఇప్పుడు కొత్తకాదు. ఇటీవల నగర శివారు ప్రాంతంలోని ఉప్పల్‌లో భాగయత్ ఫ్లాట్లను విక్రయించారు. ఈ క్రమంలో హైదరాబాద్ సిటీకి ఆనుకుని ఉన్న కోకాపేటలోని భూముల విక్రయాలకు అప్పట్లోనే ముహూర్తం పెట్టారు. గతం నుంచే ఈ భూములను అమ్మేందుకు ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. అయితే, ఆ భూములు తమవే అని కొందరు కోర్టుకువెళ్లడంతో గత ఏడాది కోర్టు తీర్పు ప్రభుత్వానికి సానుకూలంగా ఇచ్చింది. దీంతో వెంటనే వాటిని అమ్మేందుకు సర్కారు ప్రయత్నిస్తోంది.
కోకాపేటలో 150 ఎకరాలలో లే అవుట్ రెడీగా ఉన్నట్టు హెచ్ఎండీఏ అధికారులు చెప్తున్నారు. ఐటీ కారిడార్ దగ్గరగా ఉండటంతో హాట్ కేకుల్లా ప్లాట్లు అమ్ముడు అవుతాయని అంచనా వేస్తున్నారు. కోకాపేట భూములతో కనీసం రూ.10 వేల కోట్ల ఆదాయం వస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. వచ్చే ఎన్నికలకుముందు.. వ్యూహాత్మకంగా.. వీటిని సంక్షేమ కార్యక్రమాలకు అమలు చేయాలని సర్కారు ముందస్తు.. వ్యూహం సిద్ధం చేస్తోంది. మరి దీనిపై విపక్షాలు.. ఎలా రియాక్ట్ అవుతాయో.. చూడాలి.