తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు రాజకీయాల్లో విలక్షణ నేతగా ఎలా పేరు సంపాదించుకున్నారో... పరిపాలనలో అదే ముద్ర వేసుకోవాలని తపిస్తున్నారు. ఈ క్రమంలో ఏకకాలంలో రెండు లక్ష్యాలను ముందు పెట్టుకొని ఆయన అడుగులు వేస్తున్నారు. ఇటు తన మానస పుత్రిక అయిన తెలంగాణకు హరితహారం ప్రాజెక్టును విజయవంతం చేయడం, అటు ఎప్పట్నుంచో ఎదురు చూస్తున్న నామినేటెడ్ పదవుల భర్తీకి శ్రీకారం చుడుతున్నారు.
ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ చేపట్టిన కీలక పథకాల్లో ఒకటైన తెలంగాణ హరితహారం కార్యక్రమాన్ని దిగ్విజయం చేసే క్రమంలో నేతల పనితీరును అంచనా వేయనున్నట్లు ఆయనే ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ పథకాలు అర్హులకు అందించడం, ప్రజా సంక్షేమ పథకాల అమలులో నేతల భాగస్వామ్యం పెంచేందుకు సరికొత్త వ్యూహాన్ని రచించి అమలు పరిచేందుకు కేసీఆర్ నిర్ణయించినట్లు విశ్వసనీయ సమాచారం. ఇప్పటి వరకు ప్రభుత్వ పథకాల అమలు - ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాల్లో అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలు - ఎమ్మెల్సీలు - ఎంపీలు - మంత్రులు కొందరు మొక్కుబడిగా పాల్గొన్నారు. హరితహారం కార్యక్రమంలో పాల్గొన్న నేతలకు ప్రాధాన్యం ఉంటుందని స్వయంగా కేసీఆర్ ప్రకటించడంతో హరితహారం కార్యక్రమంలో పొటాపొటీగా నేతలు పాల్గొంటున్నారు. ఈ క్రమంలో హరితహారం కార్యక్రమంలో పాల్గొన్న నేతల వివరాలను ఇంటలిజెన్స్ వర్గాల ద్వారా సీఎంఓ సేకరిస్తోంది. ఈ నేపథ్యంలో సీఎంఓ ప్రోగ్రెస్ రిపోర్టులో ఏ గ్రేడ్ సాధించిన ఎమ్మెల్యేల పంట పండబోతోందని సమాచారం.
కేసీఆర్ సర్కారు చేపట్టిన హరితహారం పథకంతో కొందరు నాయకుల పంట పండబోతున్నదని అంటున్నారు. ఆకుపచ్చ తెలంగాణకు కృషిచేసిన వారికి కేసీఆర్ అదిరిపోయే గిఫ్ట్ ఇవ్వబోతున్నారని సమాచారం. గత అయిదు వారాల నుంచి జోరుగా సాగుతున్న హరితహారంలో సర్పంచ్ లు మొదలుకొని మంత్రుల వరకు అందరూ ఉత్సాహంగా పాల్గొంటున్నారు. సీఎస్ రాజీవ్ శర్మ వీడియో కాన్ఫరెన్స్ లు నిర్వహిస్తున్నారు. తాజా సమాచారాన్ని ఎప్పటికప్పుడు కేసీఆర్ కు నివేదిస్తున్నారు. సీఎంఓ అధికారులు కూడా రోజువారీ ప్రోగ్రెస్ రిపోర్టులు తయారు చేసి ముఖ్యమంత్రి టేబుల్ మీద ఉంచుతున్నారు. ఈ రిపోర్టుల ఫలితంగా హరితహారం కార్యక్రమంలో బాగా పనిచేసిన ఓ నలుగురు ఎమ్మెల్యేలకు బంపర్ బహుమతి లభించబోతున్నదనేది తాజా టాక్. సూటిగా చెప్పాలంటే ఆ నలుగురికీ ఓ రేంజ్ లో ఉండే నామినేటెడ్ పదవులు కట్టబెట్టబోతున్నారట. ఇదీ తాజాగా టీఆర్ ఎస్ వర్గాలలో విస్తృత ప్రచారం జరుగుతోంది..! వారి పేర్లు త్వరలో ప్రకటిస్తారంటూ పార్టీ శ్రేణులు చెప్తున్నాయి. మిషన్ భగీరథ - టీఎస్ ఆర్ టీసీ - ఖనిజాభివృద్ధి లాంటి కీలక పదవులన్నీ ఇప్పటికే కేసీఆర్ భర్తీచేశారు. వీలైనంత త్వరగా మిగిలిన పదవులను కూడా పూరించాలని ఆయన ఓ నిర్ణయానికి వచ్చారన్నది విశ్వసనీయ వర్గాల కథనం. దీనికి హరితహారం వేదికగా ముహూర్తం కుదిరిందని అంటున్నారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ మదిలో ఏముందో తెలుసుకునేందుకు పలువురు ఆశావహులు హైదరాబాద్ లో తచ్చాడుతుండటం ఆసక్తికరం.