కేసీఆర్ ప్ర‌చారంలో బాబుపై నిప్పులేన‌ట‌!

Update: 2018-11-03 05:23 GMT
అస‌లే కేసీఆర్‌. ఆపై కోపం. క‌ల‌గ‌లిస్తే.. నిప్పులు చెర‌గ‌ట‌మే ల‌క్ష్య‌మంటున్నారు. వాతావ‌ర‌ణం త‌న‌కు పూర్తిగా అనుకూలంగా ఉంద‌న్న భావ‌న‌తో ఆఘ‌మేఘాల మీద ప్ర‌భుత్వాన్ని ర‌ద్దు చేసి ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు వెళ్లిన వేళ కేసీఆర్ ఏ మాత్రం ఆలోచించ‌ని అంశాలు ఇప్పుడు ఒక్కొక్క‌టిగా తెర మీద‌కు వ‌స్తున్నాయి.

ఆయ‌నే మాత్రం ఊహించ‌ని కూట‌మి కాన్సెప్ట్ ఒక‌టైతే.. ప్ర‌భుత్వంపైనా.. త‌న ఎమ్మెల్యేల‌పైనా ఇంత పెద్ద ఎత్తున ఆగ్ర‌హం ఉంద‌న్న విష‌యాన్ని గుర్తించ‌టంలో కేసీఆర్ ఫెయిల్ అయిన‌ట్లుగా చెబుతున్నారు. తాను చేయించిన ప‌దికి పైగా స‌ర్వేల‌లో త‌న విజ‌యం క్లియ‌ర్ గాఉంద‌ని చెప్ప‌ట‌మే కాదు.. వంద‌కు త‌గ్గ‌కుండా సీట్ల‌ను సొంతం చేసుకుంటామ‌న్న ధీమాను ప్ర‌ద‌ర్శించారు.

అయితే.. వాస్త‌వం మ‌రోలా ఉండ‌టం ఆయ‌న్ను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. తొలుత వంద సీట్లు ప‌క్కా అని చెప్పిన కేసీఆర్ త‌ర్వాత ఒక ద‌శ‌లో 110 సీట్ల వ‌ర‌కూ వెళ్లి ఆశ్చ‌ర్యానికి గురి చేశారు. భారీ మెజార్టీ అనుకున్న‌ది కాస్తా బొటాబొటిన సీట్లు వ‌స్తాయ‌న్న ప‌రిస్థితుల్లోకి వెళ్లిన నేప‌థ్యంలో కేసీఆర్ ఆత్మ‌ర‌క్ష‌ణ‌లో ప‌డిన‌ట్లుగా ప్ర‌చారం సాగుతోంది.

ఆ మ‌ధ్య‌న సీమాంధ్రుల్ని ఉద్దేశించి ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు నెగిటివ్ గా మార‌టం.. సీమాంధ్ర మూలాలు ఉన్న వారంతా హ‌ర్ట్ అయిన విష‌యాన్ని గుర్తించిన కేసీఆర్ అండ్ కో కాస్తంత అలెర్ట్ అయి.. సెటిల‌ర్ల‌ను బుజ్జ‌గించే ప్ర‌య‌త్నం షురూ చేశారు. కేసీఆర్ కుమారుడు తాజా మాజీ మంత్రి కేటీఆర్ ఇప్పుడు ప‌దే ప‌దే సెటిల‌ర్ల‌ను ఉద్దేశించి వ్యాఖ్య‌లు చేయ‌టం ఇందులో భాగ‌మేన‌ని చెబుతున్నారు.

ఇదిలా ఉంటే.. టార్గెట్ వంద నియోజ‌క‌వ‌ర్గాల్లో తాను ప్ర‌చారం చేస్తాన‌ని.. ఉద‌యం ఒక‌టి.. సాయంత్రం ఒక‌టి చొప్పున తాను స‌భ‌ల్లో పాల్గొంటాన‌ని చెప్పిన కేసీఆర్ ఇప్పుడు కామ్ గా ఉండ‌టం వెనుక కార‌ణం వేరేన‌ని చెబుతున్నారు. తాను అభ్య‌ర్థుల్ని ప్ర‌క‌టించిన నేప‌థ్యంలో.. కూట‌మి అభ్య‌ర్థులు కూడా తెర మీద‌కు వ‌స్తార‌ని.. ప్ర‌చారంతో తాను దూసుకెళ్లాల‌ని భావించారు.

ఇందుకు భిన్నంగా కూట‌మి వ్యూహాత్మ‌కంగా అభ్య‌ర్థుల ప్ర‌క‌ట‌న చేయ‌కుండా అధికార‌ప‌క్షంలో కొత్త స‌స్పెన్స్ ను క్రియేట్ చేశారు. కూట‌మి అభ్య‌ర్థుల ప్ర‌క‌ట‌న వ‌చ్చినంత‌నే పెల్లుబుకే అసంతృప్తిని కేసీఆర్ క్యాష్ చేసుకోవాల‌న్న ఆలోచ‌న‌లో కేసీఆర్ ఉన్న‌ట్లుగా చెబుతారు. దీనికి త‌గ్గ‌ట్లే ఆయ‌న వ్యూహాన్ని సిద్ధం చేసుకున్నారు.  త‌న వ్యూహాన్ని దెబ్బ తీసేలా కూట‌మి ఎత్తులు వేయ‌టంతో కేసీఆర్ కామ్ అయ్యారు. తాను ఎక్కువ‌గా తెర మీద‌కు రాకుండా జాగ్ర‌త్త ప‌డుతున్నారు. జ‌రుగుతున్న ప‌రిణామాల‌ను నిశితంగా గ‌మ‌నిస్తున్న కేసీఆర్‌.. బాబు..కాంగ్రెస్ ల‌పై కొత్త త‌ర‌హాలో విరుచుకుప‌డేలా త‌న వాద‌న‌ను రెఢీ చేసుకుంటున్న‌ట్లు తెలుస్తోంది.

త్వ‌ర‌లో మ‌లిద‌శ ఎన్నిక‌ల ప్ర‌చారాన్ని స్టార్ట్ చేయ‌నున్న కేసీఆర్‌.. త‌న వ్యాఖ్య‌ల్లో ఘాటు మ‌రింత పెంచాల‌న్న ఆలోచ‌న‌లో ఉన్న‌ట్లు చెబుతున్నారు. రెట్టింపు మ‌సాలా మాట‌తో రాజ‌కీయాన్ని మ‌రింత వేడెక్కేలా చేయ‌ట‌మే కాదు.. భావోద్వేగాన్ని రంగ‌రించి.. సెంటిమెంట్ త‌ట్టి లేపేలా కేసీఆర్ ప్ర‌సంగాలు ఉంటాయ‌ని చెబుతున్నాయి. అందుకే. ఆల‌స్య‌మైనా ఫ‌ర్లేదు కానీ.. పిక్చ‌ర్ మొత్తం క్లారిటీ వ‌చ్చిన త‌ర్వాతే ప్ర‌చార గోదాలోకి దిగాల‌న్న‌ది ఆయ‌న ల‌క్ష్యంగా తెలుస్తోంది. ఏది ఏమైనా.. ఈసారి ప్ర‌చార వేడి ఒక రేంజ్లో ఉంటుంద‌ని.. త‌న ఘాటు వ్యాఖ్యల‌తో చ‌లిలో రాజ‌కీయ వేడిని కేసీఆర్ పుట్టిస్తార‌ని చెబుతున్నారు.
Tags:    

Similar News