గత వారం రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ సంచలనాలకు కొదవ లేకుండా పోతుంది. యాక్షన్..థ్రిల్లర్ సినిమాను తలపించే సంఘటనలు ఒకటి తర్వాత ఒకటిగా రియల్ లైఫ్‌లో రీల్ లైఫ్ మాదిరిగా సాగిపోవటం గమనార్హం.
అచ్చు సినిమాల్లో మాదిరి సంఘటనలు ఒకటి తర్వాత ఒకటిగా సాగిపోతున్నాయి. ఓటుకు నోటు వ్యవహారంలో రేవంత్‌రెడ్డికి సంబంధించి వీడియో టేపులు బయటకు రావటం మొదలు.. వారం తర్వాత మళ్లీ ఆదివారం రాత్రిపూట ఏపీ సీఎం చంద్రబాబు మాట్లాడినట్లు చెబుతున్న ఆడియో టేపు బయటకు వచ్చింది. ఈ మొత్తం వ్యవహారంలో స్టీఫెన్‌సన్ కేంద్రంగా ఉండటం గమనార్హం.
ఈ వ్యవహారంపై ఒకసీనియర్ ఏసీబీ అధికారి చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. ఈ మొత్తం ఎపిసోడ్‌లో తెలంగాణ అధికారపక్షం అత్యంత వ్యూహాత్మకంగా వ్యవహరిస్తే.. తెలంగాణ తెలుగుదేశం నేతలు.. ఏపీ అధికారపక్షనేతలు అత్యుత్సాహంతో.. మితిమీరిన ఆత్మవిశ్వాసంతో తప్పటడుగులు వేస్తున్నారన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేయటం గమనార్హం.
ఈ అధికారి ఒక కీలకమైన వ్యాఖ్య చేశారు. ''తెెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఓ పెద్ద గొయ్యి తీసి పెడితే.. అందులోకి వచ్చి అమాయకంగా తెలుగుదేశం పార్టీ నేతలు ఒక్కొక్కరిగా పడిపోతున్నారు. చివరకు ఆ పార్టీ అధినేత చంద్రబాబు కూడా పడిపోవటం ఏమిటి?'' అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
రేవంత్ వ్యవహారంలో తెలుగుదేశం పార్టీకి కాస్తంత ఇబ్బంది తప్పదని.. చంద్రబాబు ఆడియో టేపు విషయంలో మాత్రం రాజకీయ అలజడి తప్పించి.. వ్యక్తిగతంగా ఎలాంటి నష్టం వాటిల్లే అవకాశం లేదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. రాజకీయంగా గోతులు తీసే వారి గురించి.. సుదీర్ఘకాలంగా రాజకీయాల్లో ఉన్న చంద్రబాబు గుర్తించకపోవటం ఏమిటి? చెప్మా..!