తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తీరు కాస్త భిన్నం. ఆయన ఎప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో అస్సలు చెప్పలేం. ఆ మధ్యన శ్రీకాకుళం ఎంపీ కింజరపు రామ్మోహన్ నాయుడి పెళ్లి జరిగింది. పెళ్లికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిసి శుభలేఖను ఇచ్చారు. ఈ సందర్భంగా రామ్మోహన్ నాయుడి తండ్రి దివంగత నేత ఎర్రన్నాయుడితో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.
శుభలేఖ ఇవ్వటానికి వచ్చినప్పుడు కేసీఆర్ స్పందనను చూసిన తర్వాత ఎవరైనా పెళ్లికి వస్తారని భావిస్తారు. కానీ.. ఆయన వెళ్లలేదు. రామ్మోహన్ నాయుడి పెళ్లికి మాత్రమే కాదు.. చాలామంది పెళ్లిళ్లకు కేసీఆర్ వెళ్లరన్న మాట చెబుతుంటారు. కానీ.. కొన్ని ఆహ్వానాలకు ఆయన స్పందన వేరుగా ఉంటుంది.
తాజాగా అలాంటిదే చోటు చేసుకుంది. వచ్చే నెల ఒకటో తేదీన అనంతపురం జిల్లాలో పరిటాల శ్రీరామ్ పెళ్లి జరగనుంది. ఈ పెళ్లి వేడుకకు కేసీఆర్ వెళ్లనున్నారన్న విషయం బయటకు వచ్చింది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. పరిటాల వారింట జరుగుతున్న పెళ్లి వేడుకకు కేసీఆర్ హాజరు కావాలని నిర్ణయించుకున్నారని తెలుస్తోంది.
ఇందుకు సంబంధించిన సమాచారాన్ని ఏపీ ప్రభుత్వానికి తెలంగాణ అధికారులు అందించినట్లుగా సమాచారం. కేసీఆర్ అనంతపురం పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ ఇప్పటికే అనంతపురం జిల్లా అధికారులకు చేరినట్లుగా తెలుస్తోంది. సెలెక్టివ్ గా మాత్రమే వేడుకులకు హాజరయ్యే కేసీఆర్.. పరిటాల వారింట జరుగుతున్న పెళ్లికి అనంతపురం వెళ్లాలని డిసైడ్ కావటం ఇప్పుడు ఆసక్తికరంగా మారిందని చెప్పాలి. ఇక.. శ్రీరామ్ పెళ్లి చేసుకోనున్న వధువు విషయానికి వస్తే అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గం నార్పల మండటానికి చెందిన ఏవీఆర్ కన్ స్ట్రక్షన్స్ అధినేత ఆలం వెంకటరమణ.. సుశీలమ్మల కుమార్తె జ్ఞానవి. ఈ మధ్యనే వీరి ఎంగేజ్ మెంట్ హైదరాబాద్ లోని ఎన్ కన్వెన్షన్ లో జరిగింది. సో.. పరిటాల వారింట జరిగే పెళ్లికి రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరు కానున్నారన్న మాట.