చాలామంది ముఖ్యమంత్రులకు భిన్నమైన ధోరణిని ప్రదర్శిస్తుంటారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి. ఆయన ఎప్పుడు ఎలా రియాక్ట్ అవుతారా? అన్న విషయాన్ని చాలామందిలో కన్ఫ్యూజన్ ఉంటుంది. దీన్ని పెంచేలా కేసీఆర్ మరోసారి ప్రయత్నించారు. తన ఇంటికి ఎప్పుడు ఎవరిని లంచ్‌కు పిలుస్తారో ఒక పట్టాన అర్థం కాదంటారు కేసీఆర్ సన్నిహితులు.
అయితే.. ఈ విషయంలో స్పష్టత ఏమిటంటే.. తన ఇంటికి లంచ్ కు ఆహ్వానం పంపారు అంటే.. వారి పట్ల కేసీఆర్ కు బాగా ఇష్టమైనా ఉండాలి.. లేదంటే.. సదరు వ్యక్తితో మరింత సన్నిహిత సంబంధాన్ని కోరుకుంటే తన ఇంటికి భోజనానికి పిలిపిస్తుంటారు. తాజాగా అలాంటి అనుభవమే సివిల్స్ టాపర్.. తెలంగాణ ప్రాంతానికి చెందిన అనుదీప్ ను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ లంచ్ కు ఆహ్వానించారు
సివిల్స్ లో ఫస్ట్ ర్యాంక్ సాధించటం ద్వారా జాతీయ స్థాయిలో తెలంగాణ రాష్ట్ర కీర్తి పతాకాన్ని ఎగురవేసిన అనుదీప్ విజయం పట్ల కేసీఆర్ సంతోషంగా ఉన్నట్లు చెబుతున్నారు. 2013లో సివిల్స్ రాసి.. ప్రస్తుతం ఐఆర్ ఎస్ సర్వీస్ లో ఉన్న అనుదీప్.. తాజాగా పరీక్షలో ఏకంగా జాతీయస్థాయిలో ఫస్ట్ ర్యాంక్ ను సాధించారు.
అనుదీప్ తెలంగాణ రాష్ట్రంలోని జగిత్యాల జిల్లా మెట్ పల్లికి చెందిన వాడు. సివిల్స్ టాపర్ గా నిలిచిన అనుదీప్ ను తెలంగాణ రాష్ట్ర సర్కారు సముచిత రీతిలో గౌరవం ఇవ్వాలన్న ఆలోచనలో భాగంగానే ముఖ్యమంత్రి కేసీఆర్ తాజాగా లంచ్ కు ఆహ్వానించారనే చెప్పాలి.