దసరా రోజున అంగరంగ వైభవంగా ఏపీ రాజధాని శంకుస్థాపన కార్యక్రమాన్ని చేపట్టాలన్న ప్రయత్నంలో ఏపీ సర్కారు ఫుల్ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ రోజు ఏపీకి రావాలంటూ దేశ.. విదేశీ అతిధుల్నిపలువుర్ని ఏపీ సర్కారు ఆహ్వానించటం తెలిసిందే. ఇదిలా ఉంటే.. దసరా రోజున తెలంగాణ సర్కారు సైతం కొన్ని కార్యక్రమాన్ని చేపట్టనుంది. ఇందుకు సంబంధించి ఆహ్వానాల్ని అందిస్తోంది.
మొన్నటికి మొన్న యాదాద్రి పనుల్ని దసరా రోజున మొదలు పెట్టాలని నిర్ణయం తీసుకోవటం తెలిసిందే. తాజాగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న డబుల్ బెడ్ రూం ఇళ్ల పథకానికి సంబంధించి.. గృహప్రవేశాల్ని నిర్వహించాలని నిర్ణయించారు. ఇందులోభాగంగా ఈ కార్యక్రమానికి హాజరుకావాల్సిందిగా గవర్నర్ నరసింహన్ కు ఆహ్వానం అందించారు.
సికింద్రాబాద్ ఐడీహెచ్ కాలనీలో పేదలకు ఇవ్వనున్న డబుల్ బెడ్ రూం ఇళ్లసముదాయాన్ని దసరా పండుగ రోజు గృహప్రవేశాలు చేయించాలని నిర్ణయించారు.
అయితే.. ఈ గృహప్రవేశాల సమయం.. అమరావతి శంకుస్థాపన సమయం దాదాపు ఒకే సమయంలో ఉండటం గమనార్హం. ఏపీ రాజధాని శంకుస్థాపన కార్యక్రమానికి కౌంటర్ గా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గృహప్రవేశాల్ని.. యాదాద్రి అభివృద్ధి పనుల్ని చేపట్టినట్లుగా రాజకీయ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. మరి గవర్నర్ వెళ్లేది శంకుస్థాపనకా? గృహప్రవేశాలకా?