కళ్లు కాయలు కాసేలా ఎదురు చూసిన సమయం రానే వచ్చింది. ఎట్టకేలకు తెలంగాణలో ప్రభుత్వం ఏర్పడి 66 రోజులు గడిచిన తర్వాత సీఎం కేసీఆర్ కేబినెట్ విస్తరణకు ముహూర్తం నిర్ణయించారు. ఆశావహులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఆ సమయం వచ్చేసింది.
ఎన్నికల ఫలితాలు వెలువడ్డాక డిసెంబర్ 11న తెలంగాణలో టీఆర్ ఎస్ అధికారంలోకి వచ్చింది. కేసీఆర్ - మమమూద్ అలీ మాత్రమే మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. అప్పటి నుంచి రెండు నెలలుగా మంత్రివర్గాన్ని విస్తరించకుండా కేసీఆర్ నాన్చుతూ వస్తున్నారు. ఎట్టకేలకు కొత్త మంత్రులకు పచ్చజెండా ఊపారు. దాదాపు 10 మందికిపైగా అమాత్యులుగా అవకాశం కల్పించేందుకు సిద్ధమయ్యారు.
శుక్రవారం గవర్నర్ నరసింహన్ తో కేసీఆర్ భేటి కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ భేటి ముగియగానే సీఎంవో కార్యాయలం ప్రెస్ నోట్ ను విడుదల చేసింది. ఈనెల 19న సీఎం కేసీఆర్ కేబినెట్ ను విస్తరిస్తున్నట్టు ప్రకటన చేసింది. రాజ్ భవన్ లో అధికారులు ఏర్పాట్లు చేయాలని కేసీఆర్ ఆదేశించారు.
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈనెల 22న ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలోనే 19న కేబినెట్ విస్తరణకు కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఆ రోజు మాఘ శుద్ధ పౌర్ణమి కావడంతో మంచిరోజుగా భావించి ఈ నిర్ణయం తీసుకున్నారు. తొలి దశలో 10మందికి మంత్రులుగా అవకాశం కల్పిస్తారని.. పార్లమెంట్ ఎన్నికల తర్వాత మిగతా వారిని కలుపుకుంటారని సమాచారం.
పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. కేసీఆర్ మంత్రివర్గ విస్తరణలో ఎవరెవరు ఉండాలన్న దానిపై తుదిరూపు తీసుకొచ్చినట్టు తెలిసింది. సామాజిక కుల సమీకరణాలు, మహిళా కోటా లెక్కలన్నీ వేసి కేబినెట్ కూర్పు తయారు చేసినట్టు చెబుతున్నారు. అయితే కేబినెట్ లో తీసుకునే మొత్తం 10మంది మంత్రుల్లో పాత ఎమ్మెల్యేలతోపాటు కొత్తగా అసెంబ్లీకి ఎన్నికైన వారికి మంత్రి పదవులు దక్కవచ్చన్న ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఆదిలాబాద్ కు చెందిన జోగు రామన్న - అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి సహా కొంతమందికి ఈసారి మంత్రి పదవులు దక్కకపోవచ్చన్న చర్చ పార్టీ వర్గాల్లో జరుగుతోంది. మరి కేసీఆర్ పదవులు ఇచ్చే ఆ పది మంది అదృష్టవంతులు ఎవరనేది ఆసక్తిగా మారింది.