స్టేట్ మెంట్ నంబర్ 1:
"తెలంగాణలో ఉన్నవారంతా ఇక్కడి వారే. వారికి ఏం కష్టం కాకుండా మేం చూసుకుంటాం. వారి కాళ్లో ముళ్లు గుచ్చుకున్న నేను తీస్తా" పలువురు సీమాంధ్ర సెటిలర్లు కొద్దికాలం క్రితం ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో టీఆర్ ఎస్ పార్టీలో చేరిన సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ప్రకటన ఇది.
స్టేట్ మెంట్ నంబర్ 2:
"హైదరాబాద్ నగరంలో మరాఠీ - గుజరాతీ - పంజాబీ - బెంగాలీ వాళ్ల తరహాలోనే ఆంధ్రావాళ్లూ ఉన్నారు. అందువల్ల హైదరాబాద్ తోపాటు తెలంగాణాలో నివసించే వారందరినీ మా పార్టీ ఒకే పద్ధతిలో చూస్తుంది. వారందరూ తెలంగాణా బిడ్డలే. ఇక్కడ నివాసముంటున్న ప్రతి ఒక్కరి సంక్షేమం - రక్షణ బాధ్యత మా ప్రభుత్వానిదే అనంతరం కొద్ది రోజులకు జరిగి జరిగిన కేబినెట్ సమావేశం అనంతరం సీఎం కేసీఆర్ సచివాలయంలో స్వయంగా చెప్పిన మాటలు.
తెలంగాణ ముఖ్యమంత్రిగా... కాస్మోపాలిటన్ సంస్కృతిని కలిగి ఉన్న హైదరాబాద్ వంటి విశిష్ట ప్రాంత పరిపాలకుడిగా సీఎం కేసీఆర్ మాటలు ఆహ్వానించదగ్గ పరిణామమే అని అప్పుడు అంతా అనుకున్నారు. అయితే సీమాంధ్ర వాసుల విషయంలో కేసీఆర్ నోటినుంచి వెలువడిన ఈ వ్యాఖ్యలు మాటలకే పరిమితం అవుతాయా లేక ఆచరణలో కూడా అవకాశం ఉందా? అనే సందేహం కూడా పలువర్గాల్లో వ్యక్తమయింది. కానీ అదే నిజమయింది.
ఇంతకీ విషయం ఏంటంటే...మిలియన్ మార్చ్ సందర్భంగా, అనేక బహిరంగ సభల్లోనూ కేసీఆర్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. ట్యాంక్ బండ్ పై ఉన్నవిగ్రహాల్లో అన్నీ సీమాంధ్రులవే అని పేర్కొంటూ వాటిని తెలంగాణ రాష్ర్టంలో తొలగిస్తామని ప్రకటించారు. ఆ క్రమంలో పలువురు ఉద్యమకారులు విగ్రహాల ధ్వంసానికి పాల్పడ్డారు. అయితే ముఖ్యమంత్రి సెటిలర్లను అక్కున చేర్చుకుంటామని చెప్పినట్లుగానే తెలుగు జాతి వైభవానికి సాహిత్య, సాంస్కృతిక, కళా వైభవంతో పాటు పాలనలో విశిష్ట ఖ్యాతిని తెచ్చి పెట్టిన వైతాళికుల విగ్రహాలకు పలు నిర్ణయాలు తీసుకున్నారు. ట్యాంక్ బండ్ పై ఉన్న విగ్రహాలను పునరుద్ధరించేందుకు గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. ఈ మేరకు పలు విగ్రహాలకు కొత్త రూపు వచ్చింది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/