కొత్త సంవత్సరం వేళ కుమార్తె కోసం కొత్త గిఫ్టును తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సిద్ధం చేశారా? అంటే అవునన్న మాట వినిపిస్తోంది. లోక్ సభ ఎన్నికల్లో నిజామాబాద్ ఎంపీగా పోటీ చేసిన కవిత షాకింగ్ ఓటమి ఎదురుకావటం తెలిసిందే. తెలంగాణలో తిరుగులేని కేసీఆర్ కు కుమార్తెను గెలిపించుకోలేకపోవటానికి మించిన ఎదురుదెబ్బ మరొకటి లేదంటున్నారు. తన సర్వశక్తులు ఒడ్డినప్పటికీ.. తెలంగాణ ప్రజలు ఒక్కటిగా ఫిక్స్ అయి మరీ కవితను ఓడించి.. ముఖ్యమంత్రి కేసీఆర్ కు పంపాల్సిన సందేశాన్ని పంపినట్లుగా చెబుతారు.
చేతిలో అధికారం ఉన్నప్పటికి కుమార్తెకు ఏమీ చేయలేని పరిస్థితుల్లో సారు ఉన్నారన్న మాట బలంగా వినిపిస్తోంది. ఇదిలా ఉంటే.. కొత్త సంవత్సరంలో మాత్రం కవితకు ఖాయంగా ఎంపీ పదవి దక్కటం ఖాయమంటున్నారు. తొలిసారి ఎంపీగా గెలిచిన సమయంలో వివిధ అంశాల మీద లోక్ సభలో తన వాణిని బలంగా వినిపించిన కవితను రాజ్యసభకు పంపాలన్న యోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది.
ఈ మధ్యన జరిగిన హుజూర్ నగర్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో కవిత పోటీ చేస్తున్నట్లుగా ప్రచారం జరిగినా.. మొదట్నించి అనుకున్నట్లే ఆమెను బరిలోకి దింపలేదు. తాజాగా ఖాళీ అవుతున్న రాజ్యసభ సభ్యుల్లో తన సన్నిహితుడికి షాకిచ్చి మరీ కుమార్తెకు ఎంపీ పదవిని కొత్త సంవత్సరం గిప్టుగా ఇవ్వనున్నట్లు చెబుతున్నారు. అంచనాలకు భిన్నంగా నిర్ణయాలు తీసుకోవటంలో ముందుండే కేసీఆర్.. అందరూ అనుకున్నట్లుగా చేస్తారా? లేక.. తన విలక్షణను అదే రీతిలో నిలుపుకుంటారా? అన్నది తేలాలంటే మరికొన్ని నెలలు వెయిట్ చేయక తప్పదు.