కేసీఆర్ కంటికి వ‌చ్చిన స‌మ‌స్య ఏంటి?

Update: 2017-06-25 09:35 GMT
తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కంటికి సంబంధించి ఇబ్బందిని ఎదుర్కొంటున్నారు. ఆయ‌న కంటికి శ‌స్త్ర‌చికిత్స చేయ‌నున్నారు. నిజానికి ఈ స‌మ‌స్య కొద్దికాలంగా ఉన్న‌దే. గ‌తంలో ఢిల్లీ ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగానే శ‌స్త్ర‌చికిత్స చేయించుకోవాల్సి ఉంది. అయితే.. వైద్యుల సూచ‌న‌తో కొంత‌కాలం ఆగిన‌ట్లుగా చెబుతున్నారు. తాజాగా ఢిల్లీకి వెళ్లిన‌ కేసీఆర్ కు.. వైద్యులు ఆయ‌న ఇంటికే వ‌చ్చి ట్రీట్ మెంట్ కు అవ‌స‌ర‌మైన ముంద‌స్తు ఏర్పాట్లు చేస్తున్న‌ట్లుగా చెబుతున్నారు.

తాజాగా ఆయ‌న కంటి చూపు మంద‌గించింద‌ని.. ఇప్పుడు ఆయ‌న‌కు స‌ర్జ‌రీ అవ‌స‌ర‌మ‌ని వైద్యులు తేల్చిన‌ట్లుగా తెలుస్తోంది. యూపీఏ 1 స‌ర్కారులో కేసీఆర్ కేంద్ర కార్మిక మంత్రిగా ఉన్న‌ప్పుడు ఢిల్లీకి చెందిన డాక్ట‌ర్ స‌చ్ దేవ్ ఆయ‌న‌కు ఆప‌రేష‌న్ చేశారు. తాజాగా కూడా ఆయ‌న మ‌రోమారు శ‌స్త్ర‌చికిత్స చేస్తార‌ని చెబుతున్నారు. కంటికి ఏర్ప‌డిన పొర‌ను.. చుక్క‌ల మందుతో క‌రిగించొచ్చ‌ని భావించినా.. అలాంటిది జ‌ర‌గ‌క‌పోవ‌టంతో తాజాగా స‌ర్జ‌రీకి నిర్ణ‌యం తీసుకున్న‌ట్లుగా తెలుస్తోంది. స‌ర్జ‌రీకి కేసీఆర్ కూడా ఓకే చెప్పారట.

త్వ‌ర‌లోనే ఆయ‌న ఆప‌రేష‌న్ చేయ‌నున్న‌ట్లుగా చెబుతున్నారు. ఇప్ప‌టివ‌ర‌కూ అందుతున్న స‌మాచారం ప్ర‌కారం.. ఒక‌ట్రెండు రోజుల్లోనే ఆప‌రేష‌న్ ఉంటుంద‌ని.. ఆ త‌ర్వాత మూడు రోజులు ఢిల్లీలోనే విశ్రాంతి తీసుకుంటార‌ని చెబుతున్నారు. ఈ నెల 30న‌ చారిత్ర‌క జీఎస్టీ బిల్లును ప్ర‌త్యేకంగా పార్ల‌మెంటు సెంట్ర‌ల్ హాల్ లో కార్య‌క్ర‌మాన్ని ఏర్పాటు చేసి.. అర్థ‌రాత్రి నుంచి అమ‌లు చేయ‌నున్నారు. ఈకార్య‌క్ర‌మానికి హాజ‌రైన త‌ర్వాతే కేసీఆర్ హైద‌రాబాద్‌ కు రానున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News