తెలంగాణ రాష్ట్రం కానీ ఏర్పాటు అయితే తానేం చేస్తానంటూ పలువురు దేవుళ్లకు మొక్కుల మీద మొక్కులు మొక్కటం తెలిసిందే. అలా తాను మొక్కులన్నింటిని కలిపి.. ఒక లెక్క వేసి.. తెలంగాణ రాష్ట్ర ఖజానా నుంచి డబ్బు ఖర్చు చేస్తున్నట్లుగా ఆ మధ్యన తెలంగాణ రాష్ట్ర ముఖ్యంత్రి ప్రకటించటం తెలిసిందే.
మొక్కింది తానే అయినా.. మొక్కులన్నీ తెలంగాణ కోసమే కాబట్టి.. ఆ మొక్కులకు అయ్యే ఖర్చు అంతా తెలంగాణ బక్కసం నుంచే ఖర్చు పెట్టాలన్న మాటను కేసీఆర్ అధికారికంగా వెల్లడించేశారు. ఈఖర్చు గురించి ఎవరితోనూ ఆయన చర్చించింది లేదు. అయినా.. తెలంగాణకు ప్రభువు ఆయనే అయినప్పుడు.. మళ్లీ ప్రత్యేకింది మొక్కుల గురించి మాట్లాడాల్సింది ఏమి ఉంటుందని అనుకున్నట్లున్నారు.
ఇక.. కేసీఆర్ మాత్రమే కాదు.. ఆయన సతీమణి శోభ కూడా మొక్కులు మొక్కినట్లు తాజాగా కేసీఆర్ వెల్లడించారు. ఆమెకు సంబంధించిన ఒక మొక్కును ఆయన రివీల్ చేశారు. తెలంగాణ వస్తే తన భార్య కాళేశ్వర స్వామికి కిరీటం చేయిస్తానని మొక్కుకున్నదని.. దాన్ని తన సొంత ఖర్చుతోనే చేయిస్తున్నట్లు వెల్లడించారు. ఇక.. తనను పెంచి పెద్ద చేసిన సిద్ధిపేటకు త్వరలో రైలు వస్తుందని చెప్పిన ఆయన.. అందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు.
సిద్ధిపేటకు ఏం కావాలని హరీష్‌ను అడగాలే కానీ.. విమానం కూడా కావాలని కోరుకుంటారని కాస్తంత కామెడీ చేసిన కేసీఆర్.. సిద్ధిపేట జిల్లాను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్ని కలిపి సిద్ధిపేట జిల్లాగా చేయనున్నట్లు మరోమాట చెప్పి అక్కడి వారిని ఆనందంతో ఉక్కిరిబిక్కిరి చేశారు. చెప్పే మాటలు.. చేతల్లోకి ఎప్పుడు వస్తాయంటారు..?