ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయంపై తనకున్న అసంతృప్తిని ఓపెన్ గానే వ్యక్తం చేశారు ఏపీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి సోదరుడు కేఈ ప్రభాకర్. తనకు ఎమ్మెల్సీ సీటు ఇవ్వనందు వల్ల ఏపీ ముఖ్యమంత్రితో తనకు మనస్పర్థలు వచ్చిన మాట వాస్తవమేనని అన్నారు.
గతంలో తనకు ఇచ్చిన హామీల్ని నెరవేర్చకపోవటంపై తన ఆవేదనను వ్యక్తం చేసిన కేఈ ప్రభాకర్.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయంతో తమ మధ్య మనస్పర్థలు వచ్చినట్లుగా పేర్కొనటం గమనార్హం. కర్ణాటకలోని తమకూరు జిల్లా పావగడలోని శనీశ్వర ఆలయాన్ని కేఈ ప్రభాకర్ సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. తనకు ఎమ్మెల్సీ పదవి ఇస్తానని ఇవ్వని వైనంపై తన బాధను వ్యక్తం చేసే ప్రయత్నం చేశారు.
తనకు పదవి ఇవ్వని విషయంపై సీఎం చంద్రబాబుతోనూ.. సోదరుడు కేఈ కృష్ణమూర్తితోనూ తనకు మనస్పర్థలు వచ్చాయన్నారు. తనకు ఏపీ ఇరిగేషన్ డెవలప్ మెంట్ బోర్డు ఛైర్మన్ పదవి ఇస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇచ్చారని.. అందువల్లే తాను తెలుగుదేశం పార్టీలో కొనసాగుతున్నట్లుగా వ్యాఖ్యలు చేయటం గమనార్హం.