బీజేపీ బడ్జెట్ కోరుకుంటున్న కేజ్రీవాల్

Update: 2016-03-09 10:42 GMT
 ఢిల్లీ సీఎం - ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ విచిత్రమైన వ్యక్తి అని రాజకీయవర్గాల్లో టాక్. ఇప్పుడు అది మరోసారి నిరూపితమైంది. బీజేపీతో ఢీ అంటే ఢీ అనే కేజ్రీ ఇప్పుడు ఢిల్లీ రాష్ట్ర బడ్జెట్ తయారుచేయడంతో కాస్త సాయం చేయాలంటూ బీజేపీ సీనియర్ నేతను కోరడం దేశమంతటినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

వాజపేయి గర్నమెంటులో ఆర్థిక మంత్రిగా పలుమార్లు సెంట్రల్ బడ్జెట్ ప్రవేశపెట్టిన మేధావి యశ్వంత్ సిన్హా... ఈ బీజేపీ సీనియర్ నేత ఒకప్పుడు ఒక వెలుగు వెలిగినా ఇప్పుడు నరేంద్ర మోడీ నేతృత్వంలోని ప్రభుత్వం నుంచి కాస్త దూరంగానే ఉంటున్నారు. అయితే... ఆయన తనయుడు జయంత్ సిన్హా మాత్రం మోడీ టీంలో ఉన్నారు. ప్రస్తుతం ఆర్థిక శాఖ సహాయ మంత్రి ఆయనే. అయితే... ఢిల్లీలోని ఆప్ ప్రభుత్వం బడ్జెట్ తయారీలో ఆపసోపాలు పడుతోందట... ఈ నెల 15న బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. ఈతరుణంలో బడ్జెట్ విషయంలో కేజ్రీ ఏమనుకున్నారో ఏమో కానీ మాజీ ఆర్థిక మంత్రి యశ్వంత్ సిన్హా సహాయం కోసం ఆయన్ను సంప్రదించారట. ఆయన ఓకే అన్నారో కాదన్నారో తెలియదు కానీ రాజకీయవర్గాల్లో మాత్రం ఈవిషయం చర్చనీయాంశంగా మారింది. నిత్యం బీజేపీని విమర్శించే కేజ్రీ తమ పార్టీ సీనియర్ సాయం కోరడంతో ఆ విషయంపై ఎలా స్పందించాలో కూడా అర్థం కాని బీజేపీ కూడా కామ్ గా అంతా చూస్తోందే కానీ ఇంతవరకు దీనిపై పాజిటివ్ గా కానీ నెగటివ్ గా కానీ ఏమీ మాట్లడలేదు.
Tags:    

Similar News