సీఎం నిర్ణ‌యం మ‌ళ్లీ వార్త‌ల్లోకి ఎక్కింది

Update: 2016-01-07 08:07 GMT
అరవింద్ కేజ్రీవాల్...ఢిల్లీ సీఎం హోదాలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత‌. సామాన్యుడి జ‌పం చేసే కేజ్రీకి వార్త‌ల‌న్నా... వివాదాల‌న్న ఎడ‌తెగ‌ని మ‌క్కువ‌. శ‌త్రువుల‌కు కొర‌క‌రాని కొయ్య‌గా, మీడియాకు నిరంతరం వార్త‌లు అందించే ప్రియ‌మైన రాజ‌కీయ నాయ‌కుడిగా కేజ్రీ భ‌లే గుర్తింపు సంపాదించారు. తాజాగా మ‌రోమారు త‌న క్రేజీ డెసిష‌న్‌ తో అర‌వింద్ కేజ్రీవాల్ వార్త‌ల్లోకి ఎక్కారు.

కేజ్రీవాల్‌ తాజ‌గా విద్య పేరుతో ప్రైవేట్ స్కూళ్లు చేస్తున్న వ్యాపారానికి చెక్ పెట్టారు. ఇకపై ఢిల్లీలోని ప్రైవేట్ స్కూళ్లలో నర్సరీలో మేనేజ్ మెంట్ కోటా ఉండదని స్పష్టం చేశారు. 25 శాతం సీట్లను మాత్రం ఆర్ధికంగా వెనుబడిన వర్గాలకు కేటాయించిందని, ఇకపై మిగతా 75 శాతం సీట్లను కూడా అందరికీ అందుబాటులో ఉంచాలని ఉత్త‌ర్వులు జారీచేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేట్ స్కూళ్లలో మేనేజ్ మెంట్ కోటా ఉండకూడదని ప్ర‌భుత్వం త‌ర‌ఫున‌ సీరియస్‌ గా వార్నింగ్ ఇచ్చారు. ప్రభుత్వ ఆదేశాలను పాటించని స్కూళ్లపై చర్యలు తప్పవని కూడా ఈ ఉత్త‌ర్వులో హెచ్చరించారు.

ఇప్ప‌టికే స‌రి, బేసీ నిర్ణ‌యంతో దూకుడుగా వెళుతున్న కేజ్రీ...తాజా నిర్ణ‌యంతో సామాన్యుల మన‌సు గెలుచుకుంటారేమో చూడాలి మ‌రి.
Tags:    

Similar News