దేశ రాజధానిలో కాలుష్యాన్ని తగ్గించడానికి తీసుకోవాల్సిన చర్యల పై చర్చించడానికి ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మరియు పర్యావరణ మంత్రి గోపాల్ రాయ్ మంగళవారం కేంద్ర పర్యావరణ మంత్రి భూపేందర్ యాదవ్ తో సమావేశమైన తర్వాత ఈ ఈ పరిణామం చోటు చేసుకుంది. ఇక తాజా నిర్ణయానికి సంబంధించి ఢిల్లీ పర్యావరణ మంత్రి కార్యదర్శి, కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి ప్రైవేట్ సెక్రటరీకి లేఖ రాశారు. ముఖ్యంగా గత రెండేళ్ల నుంచి కాలుష్య తీవ్రత వేగంగా ఎక్కువవుతోంది.
ఈ నేపథ్యలో వాయు కాలుష్య నియంత్రణకు సీఎం కేజ్రీవాల్ సర్కారు పలు చర్యలు తీసుకుంటోంది. సరి బేసి విధానంలో రోడ్ల మీదకు వాహనాలను అనుమతించడం మొదలు, పౌరుల్లో కాలుష్యంపై బాధ్యతను పెంచేందుకు కేజ్రీ ప్రయత్నిస్తున్నారు. మరో రెండు నెలల్లో దీపావళి పండుగ రానున్న నేపథ్యంలో ఆయన కీలక నిర్ణయం తీసుకున్నారు. వాయు కాలుష్య తీవ్రత దృష్ట్యా దీపావళికి టపాసుల క్రయ విక్రయాలు, పేల్చడంపై నిషేధం విధిస్తున్నట్లు కేజ్రీవాల్ తెలిపారు. గత మూడేళ్లుగా దివాళీ సమయంలో ఢిల్లీలో వాయు కాలుష్యం పెరుగుతోంది. ఈ ప్రమాదకర పరిస్థితుల దృష్ట్యా ఈ ఏడాది పండుగకు అన్ని రకాల ఫైర్ క్రాకర్స్ ల అమ్మకాలు, స్టోరేజ్, వాడకంపై బ్యాన్ వేస్తున్నాం. మాకు ప్రజల ప్రాణాలే ముఖ్యం అని కేజ్రీవాల్ ట్విట్టర్ వేదికగా స్పష్టం చేశారు.
గతేడాది కూడా టపాసులపై బ్యాన్ వేశామని, అయితే అది ఆలస్యంగా వేయడంతో వ్యాపారులు నష్టపోయారన్నారు. ఢిల్లీలో గాలి నాణ్యత పీఎం 2.5గా ఉందని, ఇది సురక్షితమైన లిమిట్ కంటే ఆరు రెట్లు ఎక్కువగా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. కాబట్టి ట్రేడర్లు దీన్ని అర్థం చేసుకుని క్రాకర్స్ అమ్మకాలు జరపొద్దని విజ్ఞప్తి చేశారు. గత సంవత్సరం, వ్యాపారులు టపాసులు అమ్మకానికి నిల్వ చేసిన తర్వాత నిషేధం విధించబడింది, దీని వలన వారికి నష్టం జరిగింది. సంపూర్ణ నిషేధాన్ని దృష్టిలో ఉంచుకుని ఇప్పటినుండే టపాసులను నిల్వ చేయవద్దని నేను వ్యాపారులకు విజ్ఞప్తి చేస్తున్నాను అని ఆయన చెప్పారు. దేశ రాజధాని ఢిల్లీలో అక్టోబర్ ప్రారంభంతో వాయు కాలుష్య స్థాయిలు పెరిగే అవకాశం ఉన్నందున, ఢిల్లీ ప్రభుత్వం మంగళవారం అన్ని సంబంధిత విభాగాలను సెప్టెంబర్ 21 లోగా శీతాకాలపు కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలని ఆదేశించింది.
ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ కార్యదర్శి సంజయ్ అగర్వాల్, 2021 సమయంలో పంట అవశేషాల నిర్వహణకు అవసరమైన యంత్రాలకు సబ్సిడీ ఇవ్వడానికి నాలుగు రాష్ట్రాలు-ఢిల్లీ, ఉత్తర ప్రదేశ్, హర్యానా మరియు పంజాబ్ కోసం కేంద్రం రూ .496 కోట్లను విడుదల చేసినట్లు తెలియజేసింది. 2021-22 సంవత్సరానికి పంజాబ్‌కు రూ .235 కోట్లు, హర్యానాకు రూ .114 కోట్లు, ఉత్తర ప్రదేశ్ కు రూ .115 కోట్లు, ఢిల్లీకి రూ .5 కోట్లు విడుదలయ్యాయి. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ మరియు ఇతర కేంద్ర ఏజెన్సీలు కూడా రూ. 54.99 కోట్లు అందుకున్నాయి అని అగర్వాల్ తెలియజేశారు.