ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత,ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు వరుసగా షాకులు ఎదరవుతున్నాయి. తన నోటి దురుసుతో కొన్ని ఇబ్బందులు, పార్టీ సహచరులతో చర్యలతో మరిన్ని ఇబ్బందులను కేజ్రీవాల్ ఎదుర్కుంటున్నారు. ఇటీవల పార్లమెంటు భద్రతను వీడియో తీసి సామాజిక మాధ్యమంలో పోస్టు చేసిన ఆప్ ఎంపీ భగవంత్ సింగ్ మాన్ ను ఒక రోజు సస్పెండ్ చేయాలని ఎంపీల ప్యానెల్ సిఫారసు చేసింది. పార్లమెంటులో భద్రత విధానాన్ని వీడియో తీసిన భగవంత్ సింగ్ మాన్ పై చర్చకు స్పీకర్ సుమిత్రా మహాజన్ ఎంపీల ప్యానెల్ ను నియమించిన సంగతి తెలిసిందే. ఈ బృందం నిర్ణయం తీసుకొని తాజాగా వెలువరించింది.
మరోవైపు పంజాబ్ ఎన్నికల నేపథ్యంలో ఆప్ విడుదల చేసిన దళిత్ మేనిఫెస్టోపై కేంద్ర ఎన్నికల సంఘం అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ మేరకు పంజాబ్ ఆమ్ ఆద్మీ పార్టీ శాఖకు నోటీసు పంపింది. మేనిఫెస్టో కాపీలను తమకు పంపాలని ఆదేశించింది. ఈ నెల 25న ఆప్ దళిత మేనిఫెస్టోను ఇక్కడ విడుదల చేసిన సంగతి తెలిసిందే. దేశంలోనే ఇలా దళితుల కోసం ప్రత్యేక మేనిఫెస్టో విడుదల చేసిన పార్టీగా ఆప్ ప్రత్యేకతను సాధించుకుంది.
కాగా... తన ఇంట్లో జరిగిన వివాహంపై వ్యాఖ్యానించిన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు కేంద్ర మంత్రి మహేశ్ శర్మ వెంటనే సమాధానమిచ్చారు. ప్రధాని మోడీ పెద్దనోట్లు రద్దు చేయడం..2.5 లక్షల ఖర్చుతోనే మీ బిడ్డల పెళ్లి జరుపుకోవాలని దేశ ప్రజలకు ఉచిత సలహా ఇవ్వడాన్ని కేజ్రీవాల్ వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బీజేపీ ఎంపీ - కేంద్ర మంత్రి మహేశ్ శర్మ ఇంట్లో వివాహం అట్టహాసంగా జరిగింది. దీన్ని ప్రస్తావిస్తూ... "కేంద్ర మంత్రి కుమార్తె పెళ్లికి రెండున్నర లక్షల ఖర్చే జరిగిందా? ఈ డబ్బులను (పాత నోట్లను) ఆయన ఎట్లా మార్చుకున్నారు? ఖర్చులకు చెక్కు రూపంలోనే చెల్లింపులు చేశారా?" అంటూ కేజ్రీవాల్ ట్విట్టర్ లో ప్రశ్నల వర్షం కురిపించారు. దీనికి కేంద్ర మంత్రి మహేశ్ శర్మ ట్విట్టర్ ద్వారానే ఘాటుగా స్పందించారు. "ముందు మీకు వచ్చిన సమాచారాన్ని సరిదిద్దుకోండి. జరిగింది నా బిడ్డపెండ్లి కాదు. కొడుకు పెండ్లి.. అన్ని ఖర్చులకు చెక్కు లే ఇచ్చాను నగదు కాదు" అని జవాబిచ్చారు. కేజ్రీవాల్ పొరపాటు సమాచారంతో ప్రశ్నలు వేయడాన్ని పలువురు ట్విట్టర్లు విమర్శించారు. కొన్నిరోజుల క్రితం కర్ణాటక మైనింగ్ డాన్ గాలి జనార్దన్ రెడ్డి రూ.500 కోట్లు ఖర్చుపెట్టి కుమార్తె వివాహం చేశారని వార్తలు వచ్చినపుడు కూడా కేజ్రీవాల్ విమర్శలు చేశారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/