ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిన బీజేపీకి భారీ షాకిచ్చిన కేరళ యువకుడు

Update: 2021-03-16 04:30 GMT
తాజాగా జరుగుతున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో తన ముద్ర చూపించాలని తపిస్తోంది బీజేపీ. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రంలో తన ఎదుగుదలను అందరికి అర్థమయ్యేలా చేయాలన్న తపన బాగానే ఉన్నా.. అందుకు అనుసరిస్తున్న విధానాలు ఏ మాత్రం సరిగా లేవంటున్నారు. తనకున్న పరిమిత బలాన్ని బీజేపీ అతిగా ఊహించుకుంటుందన్న విమర్శ వినిపిస్తోంది. ఇదిలా ఉంటే.. తనకు బలం ఉన్న చోట ప్రత్యర్థులకు షాకులు ఇస్తున్న బీజేపీకి.. ఆ పార్టీకి చెందిన వారు రివర్సులో ఇస్తున్నషాకులు ఆసక్తికరంగా మారాయి. తాజాగా కేరళలో ఇలాంటి ఉదంతమే చోటుచేసుకుంది.

 వేనాడ్ జిల్లాలోని మనంతవాడీఅసెంబ్లీ నియోజకవర్గానికి పనియా గిరిజన తెగకు చెందిన మణికంఠన్ ను బీజేపీ తన అభ్యర్థిగా ప్రకటించింది. ఇంతవరకు బాగానే ఉన్నా.. టికెట్ ప్రకటించిన గంటల వ్యవధిలోనే మణికంఠన్ సంచలన ప్రకటన చేశారు.బీజేపీ ఇచ్చిన టికెట్ ను తాను రిజెక్టు చేస్తున్నట్లు ప్రకటించారు. అంతేకాదు..సోషల్ మీడియాలోని తన ఖాతాల్లో ఆయన సంచలన ప్రకటన చేశారు.

తన సోషల్ మీడియా ఖాతాలో అంబేడ్కర్ బొమ్మను ఉంచిన మణికంఠన్.. ఉరేసినా తన జాతికి అన్యాయం చేయనని పేర్కొన్నారు. 31 ఏళ్ల మణికంఠన్ పనియా గిరిజన తెగలో ఎంబీఏ పట్టా పొందిన తొలి వ్యక్తిగా చెబుతారు. తాను ఏ రోజు బీజేపీ సానుభూతిపరుడిగా లేదని పేర్కొన్నారు. మరి.. పార్టీకి ఏ మాత్రం సంబంధం లేని వ్యక్తికి బీజేపీ అధినాయతకత్వం ఎమ్మెల్యే టికెట్ ఎందుకు ఇచ్చింది? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. కీలకమైన ఎన్నికల వేళ.. తాజాగా బయటకొచ్చిన ఈ ఉదంతం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
Tags:    

Similar News