మెట్రో మ్యాన్ ను సీఎం చేస్తారు.. అద్వానీని రాష్ట్రపతి చేయలేరా?

Update: 2021-03-08 04:48 GMT
మెట్రో మ్యాన్ గా పేరున్న శ్రీధరన్ పొలిటికల్ ఎంట్రీ ఇప్పుడు సంచలనంగా మారింది. బీజేపీ తీర్థం పుచ్చుకున్న ఆయన.. తాజా ఎన్నికల్లో విజయం సాధిస్తే కేరళ ముఖ్యమంత్రిగా ఆయన పదవీ బాధ్యతలు చేపట్టనున్నరు. రాజకీయాలకు వయసుకు లింకు లేదు. కానీ.. నీతులు చెప్పే మోడీషాలు అవసరానికి తగ్గట్లుగా తమ మాటల్ని మార్చుకునే సత్తా వారి సొంతమని చెప్పాలి.

మెట్రో మ్యాన్ కు ఇప్పుడు 88 ఏళ్లు. అదే సమయంలో ప్రధాని మోడీకి గురువు.. ఆయనీ స్థాయికి రావటానికి కారణమైన బీజేపీ అగ్రనేత అద్వానీకి 93 ఏళ్లు. అంటే.. మోడీ ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించే నాటికి ఆయన వయసు 86 ఏళ్లు మాత్రమే. కానీ.. పెద్ద వయసు కారణాన్ని చూపించి ఆయన్ను ఎన్నికల బరిలో నుంచి తప్పించటమే కాదు.. చివరకు ఆయనకు కల అయిన దేశ అత్యున్నత పదవిని చేపట్టనీయకుండా నిర్ణయం తీసుకున్నారని చెప్పాలి.

ఒక్క అద్వానీ మాత్రమే కాదు.. మురళీ మనోహర్ లాంటివాళ్లను వయసు పేరుతో పక్కన పెట్టేసిన మోడీషాలు.. మరీ రోజున తమ అవసరానికి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను రాజకీయాల్లోకి ఎందుకు తీసుకొచ్చినట్లు? తమపార్టీ గెలిస్తే కేరళ సీఎం పదవిని ఇస్తామని ఎందుకు చెప్పినట్లు? అన్నది అసలు ప్రశ్న.

88 ఏళ్ల వయసులో మెట్రోమ్యాన్ కేరళ ముఖ్యమంత్రి అయినప్పుడు.. ఇంచుమించు అదే వయసులో ఉన్న వేళలో.. రాష్ట్రపతి పదవికి అద్వానీని ఎందుకు ఎంపిక చేయలేదన్నది ప్రశ్న. సాధారణంగా శిష్యుడు అత్యున్నత స్థానానికి చేరితే.. గురువును నెత్తిన పెట్టుకుంటారు. మరి.. మోడీ మాస్టారు అందుకు భిన్నంగా పక్కన పెట్టేశారేంటన్న ప్రశ్నలు ఆయన ప్రత్యర్థులు సంధిస్తున్నారు.
Tags:    

Similar News