పౌరసత్వ చట్టం పై కేంద్రం తో కేరళ సీఎం ఫైట్

Update: 2020-01-02 07:14 GMT
పౌరసత్వ సవరణ చట్టం పై దేశ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బెంగాల్ లో అమలు చేయమని కేంద్రానికి ఇప్పటికే తేల్చిచెప్పారు. మరికొన్ని రాష్ట్రాల సీఎంలు కూడా పౌరసత్వ సవరణ చట్టం అమలు కానీయమని స్పష్టం చేశాయి. తాజాగా కేరళ అసెంబ్లీ లో సీఏఏను అమలు చేసేది లేదంటూ ఆ రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం ఆమోదించడం సంచలనమైంది.

అయితే తాజాగా దీని పై కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ కేరళ అసెంబ్లీలో తీర్మానంపై స్పందించారు. పౌరసత్వానికి సంబంధించి చట్టం చేసే అధికారం కానీ.. తీర్మానం ఆమోదించే అధికారం కేవలం పార్లమెంట్ కు మాత్రమే ఉందని కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ స్పష్టం చేశారు. పౌరసత్వ సవరణ చట్టం పూర్తిగా రాజ్యాంగబద్దమైనదని అన్నారు. అసెంబ్లీలకు ఎంత మాత్రం అధికారం లేదన్నారు. అమలు చేయమన్న కేరళ సీఎం న్యాయ సలహా తీసుకుంటే అర్థమవుతుందన్నారు.

కేంద్ర మంత్రి వివరణ పై కేరళ సీఎం పినరయి విజయన్ ఘాటుగా స్పందించారు. రవిశంకర్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. రాష్ట్రఅసెంబ్లీలకు సొంత హక్కులు ఉంటాయని.. ప్రత్యేక రక్షణ ఉంటుందని.. వాటిని కేంద్రం ఉల్లంఘించలేదని తేల్చిచెప్పారు.

రాజ్యాంగ ప్రాథమిక హక్కులకు భంగం వాటిల్లే తీరుగా ఉన్న పౌరసత్వ చట్టాన్ని అమలు చేయమని తీర్మానించిన తొలి రాష్ట్రం దేశంలోనే కేరళ మొదటి ది అని సీఎం పినరయి విజయన్ అన్నారు.

దీంతో కేరళ ప్రభుత్వానికి, కేంద్రానికి మధ్య యుద్ధం మొదలైంది. పౌరసత్వ చట్టం అమలు చేయమని కేరళ రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం చేయడంతో ఈ ఫైట్ ముదిరింది. కేరళ ప్రభుత్వం పార్లమెంటరీ అధికారాల ఉల్లంఘన చేస్తోందని.. దీనిపై చర్యలు తీసుకోవాలని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహరావు రాజ్యసభ చైర్మన్ వెంకయ్యకు లేఖ రాయడంతో ఈ వివాదం కొత్త మలుపు తిరిగింది.
Tags:    

Similar News