లాక్ డౌన్ పై కేరళ సీఎం కీలక నిర్ణయం ..ఏంటంటే !

Update: 2020-04-17 08:35 GMT
కరోనా మహమ్మారి వేగంగా విజృంభిస్తున్న నేపథ్యంలో కేరళ సీఎం పినరయి విజయన్‌ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. కరోనా కట్టడిలోకి రాకపోవడంతో కేంద్రం విధించిన తొలిదశ లాక్ డౌన్ గడువు ముగియగానే ..మే 3 వరకు లాక్ డౌన్ ను పొడగిస్తునట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, కేంద్రం ఏప్రిల్‌ 20  తరువాత  లాక్‌ డౌన్‌ నిబంధనలు పాక్షికంగా సడలించనున్న నేపథ్యంలో బేసి- సరి విధానంలో వాహనాలను రోడ్ల మీదకు అనుమతించనున్నట్లు అయన తెలిపారు.

అలాగే, కరోనా ప్రభావం ఉన్న జిల్లాలను నాలుగు జోన్లుగా విభజించేందుకు కేంద్రం అనుమతిని కోరినట్లు వెల్లడించారు. రాష్ట్రంలో గురువారం కొత్తగా ఏడు కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైన నేపథ్యంలో.. కాసర్‌ గడ్‌ - కన్నూరు - మలప్పురం - కోజికోడ్‌ జిల్లాలను ఒక జోన్‌ గా పరిగణిస్తూ.. అక్కడ మే 3 వరకు లాక్‌ డౌన్‌ నిబంధనలు కఠినంగా అమలు చేయబోతున్నట్టు తెలిపారు.

అలాగే ,  రెండో జోన్‌ లో పతనంతిట్ట - ఎర్నాకులం - కొల్లాం జిల్లాలు ఉంటాయని.. అక్కడ హాట్‌ స్పాట్‌ జోన్ల ను సీల్‌ చేయనున్నట్లు  సీఎం తెలిపారు. అదే విధంగా అలప్పుజ - తిరువనంతపురం - పాలక్కాడ్‌ - త్రిసూర్‌ - వయనాడ్‌ జిల్లాలను మూడో జోన్‌ గా పరిగణిస్తూ - లాక్‌ డౌన్‌ నిబంధనలను ఆయా జిల్లాల్లో పాక్షికంగా సడలించనున్నట్లు తెలిపారు. కొట్టాయం - ఇడుక్కి జిల్లాలు కోవిడ్‌-19 కేసులు లేని జిల్లాలని.. అవి నాలుగో జోన్‌ కిందకు వస్తాయని తెలిపారు. కాగా కేరళ ప్రభుత్వం వెల్లడించిన వివరాల ప్రకారం రాష్ట్రంలో గురువారం నాటికి 394 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. అందులో 147 ఆక్టివ్‌ కేసులు ఉండగా.. 245 మంది కోలుకున్నారు.  ఇప్పటివరకు కేవలం ఇద్దరు మాత్రమే కరోనా భారిన పడి మృతి చెందారు. అయితే దేశంలో తోలి కరోనా కేసు బయటపడింది కేరళ రాష్ట్రంలోనే .అయినా కూడా పటిష్టమైన చర్యలు తీసుకోవడం తో కేరళ లో కరోనా వ్యాప్తిని అడ్డుకోగలిగారు.
Tags:    

Similar News