అరెస్ట్ అయ్యి యూపీలోని జైల్లో ఉన్న కేరళ జర్నలిస్ట్ సిద్దిఖీ కప్పన్ కు ఎట్టకేలకు ఊరట లభించింది. హత్రాస్ లో 20 ఏళ్ల దళిత మహిళ దారుణ హత్యకు గురికావడంపై వార్త కవర్ చేసేందుకు సిద్ధిఖీ అక్టోబర్ 5న బయలు దేరారు. అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అప్పటి నుంచి ఆయన పోలీసుల కస్టడీలో ఉన్నారు. గత 50 రోజుల నుంచి అతడు జైలులోనే మగ్గుతున్నాడు.
చివరికి మంగళవారం సాయంత్రం సిద్దిఖీని లాయర్ కలిసేందుకు పోలీసులు అవకాశం ఇచ్చారు. తన లాయర్ తో 5 నిమిషాలు ఫోన్ కాల్ మాట్లాడారని తెలిపారు. ఆహారం ఇస్తున్నారా? మందులు ఇస్తున్నారా అన్న విషయాలను లాయర్ మాథ్యూస్ అడిగి తెలుసుకున్నారని కేరళ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ సభ్యులు తెలిపారు.
సిద్ధిఖీ అరెస్ట్ పై కేరళ జర్నలిస్ట్ యూనియన్ హెబియస్ కార్పస్ పిటీషన్ ను సుప్రీం కోర్టులో దాఖలు చేశారు. కస్టడీ నుంచి సిద్ధిఖీని విడుదల చేయాలని కోరింది. దీంతోపాటు యూపీలోని మథురలో కూడా మరో పిటీషన్ దాఖలు చేశారు.
యూపీలోని హత్రాస్ ఉదంతం జరిగినప్పుడు యూపీ పోలీసులు కఠినంగా వ్యహరించారు. వివిధ ఆంక్షలు పెట్టారు. కానీ సిద్ధిఖీ వీటన్నింటిని దాటుకొని బుల్ ఘడ్ వెళ్లగా పోలీసులు అరెస్ట్ చేసి అప్పటి నుంచి జైల్లోనే ఉంచారు.