మానవత్వం ఎక్కడుంది ... భుజం పై తండ్రిని మోసిన కొడుకు !

Update: 2020-04-16 07:30 GMT
మానవత్వం మంటకలిసింది...లాక్ డౌన్  ఆ తండ్రీ కొడుకులకు శాపంగా పరిణమించింది. కేరళ లోని కొల్లం జిల్లాలో జరిగిన హృదయ విదారక ఘటన ఇది. ఆరోగ్యం బాగాలేని తండ్రిని, కుమారుడు భుజం పై  ఎత్తుకుని కిలోమీటరు మేర నడిచిన ఘటనపై కేరళ మానవహక్కుల కమిషన్‌ విచారణకు ఆదేశించింది. అసలు విషయం ఏమిటంటే ..కేరళలోని  కొల్లాం జిల్లాలోని పునలూరు ప్రభుత్వ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్‌ అయిన తన తండ్రిని తీసుకు రావడానికి ఒక కొడుకు ఆటో లో బయలుదేరాడు.

అయితే , లాక్ డౌన్ కారణంగా మార్గ మద్యంలో ఆ ఆటోని పోలీసులు ఆపేసారు. ఇలా తన తండ్రికి ఆరోగ్యం బాగాలేదు అని , హాస్పిటల్ లో ఉన్నాడు అని , ఈ రోజు డీఛార్జ్ చేస్తున్నారని ఇంటికి తీసుకువెళ్ళడానికి ఆటోలో వెళ్తున్నట్టు చెప్పాడు. అయితే , అతని మాటలని పోలీసులు వినలేదు. దీనితో చేసేదేమి లేక ఒక కిలోమీటరు నడుచుకుంటూ ఆసుపత్రికి వెళ్లాడు. తిరిగి తన తండ్రిని తీసుకు రావడానికి వేరే అవకాశం లేకపోవడంతో ఎత్తుకుని , ఎండలో ఆటో వరకు తీసుకు వచ్చాడు. తండ్రిని ఎత్తుకుని తిరిగి వస్తున్న రోయ్‌ మన్‌ ని చూసి కనీసం అక్కడున్నపోలీసులు స్పందించ లేదు.

కేరళ మానవ హక్కుల కమిషన్ ఈ ఘటనపై స్పదించి.. సుమోటో కేసు రిజిస్టర్ చేసింది. ఆ పోలీసులపై కేసు నమోదు చేయాలని ఉన్నతాధికారులను ఆదేశించింది. అయితే పోలీసులు మాత్రం ఆసుపత్రికి సంబంధించి ఎలాంటి డాక్యుమెంట్లు చూపించకపోవడం తో అనుమతి నిరాకరించామని చెబుతున్నారు
Tags:    

Similar News