వీడియో: కరోనాను జయించిన వేళ.. ఘన వీడ్కోలు..

Update: 2020-04-05 10:05 GMT
ప్రపంచాన్ని కబళిస్తున్న కరోనా మహమ్మారి దెబ్బకు అగ్రరాజ్యం అమెరికా కూడా చిగురుటాకులా వణుకుతోంది.ప్రాణాలు కాపాడుకోలేక చేతులెత్తేస్తోంది. మందే లేని ఈ వ్యాధిని జయించడం ఎలాగో తెలియక అమెరికా కూడా తల బాదుకుంటోంది.అలాంటి మహమ్మారి బారిన పడి కూడా కోలుకుంటున్నారు మన భారతీయులు. హైదరాబాద్ లో, కేరళలో తాజాగా కరోనా కొందరు జయించారు. మిగిలిన వారికి జీవితంపై ఆశలు కల్పించారు.

తాజాగా కేరళ సహకార, పర్యాటక శాఖ మంత్రి కడకంపల్లి సురేంద్రన్ చేసిన ట్వీట్ వైరల్ అయ్యింది. కరోనా పాజిటివ్ సోకి పూర్తిగా కోలుకొని ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అవుతున్న వ్యక్తికి ఆస్పత్రి సిబ్బంది, రోగులు ఘనవీడ్కోలు పలికారు. ఆ వీడియోను షేర్ చేసిన మంత్రి ‘ఒక్కరు కోలుకున్నా అది ఘన విజయమే’ అంటూ క్యాప్షన్ ఇచ్చి షేర్ చేశాడు.

ఈ వీడియోలో కరోనాను జయించిన యువకుడు చేతులు బాహుబలిలా చాచి నడుచుకుంటూ ధీమాగా వస్తుంటే ఆస్పత్రి సిబ్బంది.. ప్రజలు ఇరువైపులా నిలుచొని చప్పట్లు కొడుతూ ప్రశంసించారు. కేరళలోని కసర్ గోడ్ లోని ప్రభుత్వాసుపత్రిలో ఈ ఘటన చోటుచేసుకుంది.  ఆస్పత్రి సిబ్బందికి ధన్యవాదాలు చెబుతూ సదురు యువకుడు ఇంటికెళ్లిపోయాడు.

ఈ వీడియో చూశాక కరోనా అంటే జనంలోనూ నెటిజన్లలో ఉన్న భయం పోతోంది. దీన్ని జయించవచ్చన్న ధీమా పెరిగింది. వీడియో చూసి చాలా మంది షేర్లు - లైక్ లు చేస్తున్నారు. మళ్లీ ఇలా సాధారణ రోజులు రావాలని కోరుకుంటున్నారు.

వీడియో కోసం క్లిక్ చేయండి
Tags:    

Similar News