కేరళలో మిస్ అయినోళ్లు ఐఎస్ లో చేరిపోయారు

Update: 2016-07-17 04:38 GMT
కేరళలో మిస్ అయిన 21 మంది ఎక్కడికి వెళ్లారన్న దానిపై స్పష్టత వచ్చేసినట్లే. కేరళకు చెందిన కాసర్ గోడ్ జిల్లాకు చెందిన 21 మంది కనిపించకుండా వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. ఉగ్రవాద భావజాలంతో వెళ్లినట్లుగా గుర్తించిన అధికారుల అనుమానాలు నిజమైనట్లే కనిపిస్తున్నాయి. కొద్దిరోజుల కిందట మిస్ అయిన వారిలో ఒకడైన 23 ఏళ్ల హఫీజుద్దీన్ హకీం తన భార్యకు వాట్సప్ కు మెసేజ్ పెట్టాడు. తనపైన అమెరికా యుద్ధ విమానాలు తిరుగుతున్నాయని పేర్కొనటమే కాదు.. తన తల్లిదండ్రులు ఇస్లామిక్ స్టేట్ కు రావాలని ఆహ్వానించటం గమనార్హం.

నిజమైన ఇస్లాంను షరియా చట్టాలను అనుసరించే గడ్డగా పేర్కొన్న అతడి తాజా మెసేజ్ తో కేరళలో కనిపించకుండా పోయిన వారంతా ఇస్లామిక్ స్టేట్ లో చేరినట్లుగా భావిస్తున్నారు. కేరళ నుంచి వీరు సిరియా.. ఇరాక్ లోని ఐఎస్ ప్రాబల్య ప్రాంతాల్లో ఉండే అవకాశం ఉందన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. చూస్తుంటే.. జాతీయ దర్యాప్తు బృందం మరిన్నిప్రాంతాల్లో దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్న భావన వ్యక్తమవుతోంది.
Tags:    

Similar News