కేరళ ఇప్పుడు యూట్యూబ్ లో బూతు రాష్ర్టం కాదు

Update: 2017-04-12 09:58 GMT
కేరళ అంటే భూతల స్వర్గం... దేవుడి స్వస్థలం అంటారు. అక్కడి ప్రకృతి సౌందర్య, జల సంపద, చల్లని వాతావరణం అన్నీ పర్యాటకులకు పెద్ద ఆకర్షణ. కానీ, అదే సమయంలో కేరళపై ఇంకో పెద్ద మచ్చ కూడా ఉంది. కేరళ అనగానే బూతు చిత్రాలకు పెట్టింది పేరు. ఈ కారణంగా ఇంటర్నెట్లో కేరళ అని టైప్ చేస్తే చాలు ఆ రాష్ర్టం గురించి మంచి వచ్చే మంచి సమాచారం కంటే అశ్లీల సమచారమే ఎక్కువగా వస్తోందట. ముఖ్యంగా యూట్యూబ్ లో అయితే కేరళ అని టైప్ చేయగానే పేజీలకొద్దీ పోర్న్ మూవీలు కనిపిస్తున్నాయి. గూగుల్ సెర్చిలోనూ అంతే... కేరళ అని సెర్చి చేయగానే వచ్చే టాప్ 20 రిజల్ట్స్ లో పోర్న్ క్లిప్పింగ్సే ఎక్కువగా ఉంటున్నాయి.
    
దీంతో ఇలాంటి పోర్న్ బ్రాండ్ తమ పర్యాటక రంగంపై ప్రభావం చూపుతుందని ఆ రాష్ర్టం ఆందోళన చెందుతోంది. దీన్ని అరికట్టడానికి కేరళ టూరిజం శాఖ గట్టి ప్రయత్నమే చేసింది. టూరిజానికి సంబంధించిన వీడియోలను పెద్ద ఎత్తున యూట్యూబ్ లో పోస్ట్ చేయడం ప్రారంభించింది. నాలుగేళ్లుగా ఈ పనిచేయడంతో ఇప్పుడు యూట్యూబ్ లో కేరళ అని టైప్ చేస్తే పర్యాటక వీడియోలు వస్తున్నాయి. ఇప్పటికీ పోర్న్ క్లిప్లింగులు వస్తున్నా ఆ ప్రభావం కొంత తగ్గింది.
    
2012 నుంచి కేరళ పర్యాటక శాఖ అక్కడి పర్యాటక ప్రాంతాలు, ప్యాకేజీలు, సుందర దృశ్యాలకు సంబంధించిన వీడియోలు పోస్టు చేయడం ప్రారంభించింది. దాంతో పాటు యూట్యూబ్ తో ఒప్పందం చేసుకుని తమ వీడియోలు పాపులర్ అయ్యేలా చేసుకుంది. దీంతో కేరళ ఇప్పుడు యూట్యూబులో బూతు రాష్ర్టంగా కాకుండా పర్యాటక రాష్ర్టంగా కనిపిస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News