కేరళ సీఎం విజయన్ పై స్మగ్లింగ్ ఆరోపణలు!

Update: 2020-07-07 17:35 GMT
కేరళ రాష్ట్రంలో బంగారం స్మగ్లింగ్ వ్యవహారం పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ వ్యవహారంలో సీఎం కార్యాలయం ప్రమేయం ఉందనే ఆరోపణలతో కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రిన్సిపల్ కార్యదర్శి, ఐటీ సెక్రెటరీ ఎం. శివశంకర్ ను తొలగించడం రాజకీయ దుమారాన్ని రేపింది.

గత వారం కేరళలో బంగారం స్మగ్లింగ్ వ్యవహారం వెలుగుచూసింది. ఈ వ్యవహారంలో ఐటీశాఖ ఉద్యోగి పాత్రపై ఆరోపణలు బయటపడ్డాయి. మరుసటిరోజే శివశంకర్ పై రాష్ట్ర ప్రభుత్వం వేటు వేసింది.

ఇటీవల దుబాయ్ నుంచి వచ్చిన చార్టర్డ్ విమానంలో వచ్చిన కన్ సైన్ మెంట్ ద్వారా దాదాపు 30 కిలోల బంగారాన్ని తిరువనంతపురం విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకోవడంతో ఈ దందా వెలుగుచూసింది.

కేరళలో యూఏఈ కాన్సులేట్ లో పనిచేసే ఓ మాజీ ఉద్యోగిని సోమవారం కాన్సులేట్ అధికారులు అరెస్ట్ చేశారు. రూ.15కోట్ల విలువైన బంగారం స్మగ్లింగ్ జరిగినట్టు తెలిసింది.

గోల్డ్ స్మగ్లింగ్ వ్యవహారం ఇప్పుడు కేరళ సీఎంను తాకింది. దీనివెనుక సీఎం విజయన్ ఉన్నారని కాంగ్రెస్, బీజేపీలు ఆరోపించాయి. సీఎం కార్యాలయం కేరళలో నేర కార్యకలాపాలు అడ్డాగా మారిందని ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. దీంతో గోల్డ్ స్మిగ్లింగ్ వ్యవహారం కేరళసీఎం మెడకు చుట్టుకున్నట్టైంది.
Tags:    

Similar News