మోడీని మ‌లయాళీలు మ‌రెప్ప‌టికీ క్ష‌మించ‌రా?

Update: 2018-08-23 08:05 GMT
నాలుగేళ్ల క్రితం మోడీ అన్నంత‌నే దేశ ప్ర‌జ‌ల్లో ఒక ఉత్తేజం.. ఒక న‌మ్మ‌కం.. ఒక ఆశ ఉండేది. నాలుగున్న‌రేళ్ల మోడీ పాల‌న అనంత‌రం ప‌లు విమ‌ర్శ‌లు మోడీపైన వెల్లువెత్తుతున్నాయి. కొన్ని అంశాల విష‌యంలో ఆయ‌న అనుస‌రిస్తున్న వైఖ‌రి చూస్తే.. చెప్పే నీతుల‌కు.. చేసే ప‌నుల‌కు ఏ మాత్రం పోలిక లేద‌న్న విష‌యం ఇట్టే అర్థ‌మ‌వుతుంటుంది.

ఏపీ హోదా విష‌యంలో ఆంధ్రోళ్ల ఆశ‌ల సౌధాల్ని కుప్ప‌కూల్చ‌ట‌మే కాదు.. ఆర్థికంగా మ‌రింత కుంగిపోయేలా తీసుకున్న చ‌ర్య‌ల‌తో ఏపీ ప్ర‌జ‌లు తీవ్ర ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేస్తున్నారు. హోదా విష‌యంలో ఇచ్చిన మాట‌ను వెన‌క్కి తీసుకోవ‌ట‌మే కాదు.. మ‌నోభావాలు దెబ్బ తీసేలా వ్య‌వ‌హ‌రిస్తున్న వైఖ‌రిపై గుర్రుగా ఉన్నారు.

ఎన్నిక‌ల వేళ‌.. మోడీ బ్యాచ్ కు చుక్క‌లు చూపించేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు. మోడీ పేరు వింట‌నేనే ఏపీ ప్ర‌జ‌లు మండిప‌డుతున్న ప‌రిస్థితి. ఇదిలా ఉంటే.. మోడీని ఏపీ ప్ర‌జ‌ల‌కు మించిన ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్న వారిగా మ‌ల‌యాళీలు చేరారు. వందేళ్ల‌లో ఎప్పుడూ లేనంత తీవ్రంగా విరుచుకుప‌డిన వ‌ర్షాల ధాటికి కేర‌ళ చిగురుటాకులా వ‌నికిపోవ‌ట‌మే కాదు.. ల‌క్ష‌లాది మంది దారుణంగా న‌ష్ట‌పోయారు. ఇక‌.. కేర‌ళ అయితే.. కోలుకోలేనంత‌గా దెబ్బ తింది. ఇలాంటి వేళ‌.. దేశ ప్ర‌ధానిగా సాయం అందించి.. అండ‌గా ఉండాల్సిన మోడీ.. అందుకు భిన్నంగా వ్య‌వ‌హ‌రించ‌ట‌మే కాదు.. సాయం ఇచ్చే విష‌యంలో ఆయ‌న వ్య‌వ‌హ‌రిస్తున్న తీరుపై ఆగ్ర‌హం వ్య‌క్త‌మ‌వుతోంది.

ఈ మ‌ధ్య‌నే ముగిసిన ఎన్నిక‌ల్లో రెండంటే రెండే సీట్లు బీజేపీకి వ‌చ్చాయి. అధికారంలోకి రావ‌టం త‌ర్వాత ప‌ట్టుమ‌ని ప‌ది సీట్లు కూడా పొందే అవ‌కాశం లేని రాష్ట్రంపై మోడీకి ఉన్న ఆగ్ర‌హ‌మే.. ఇప్పుడా రాష్ట్రానికి సాయం అందించే విష‌యంలో మోడీ ప‌ట్ట‌న‌ట్లుగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌న్న పేరుంది. మోడీ తీరు కార‌ణంగా ఆంధ్రోళ్లు మోడీని.. బీజేపీని ఎలా అయితే మ‌ర్చిపోరో.. ఇప్పుడు వారికి జ‌త‌గా మ‌ల‌యాళీలు కూడా చేరార‌ని చెప్పాలి. మ‌రో యాభై ఏళ్ల వ‌ర‌కూ బీజేపీని కానీ.. మోడీ పేరు కానీ ఎత్తితే మల‌యాళీల ఆగ్ర‌హాం ఎంత ఉందో చూడాల్సి వ‌స్తుంద‌న్న అభిప్రాయాన్ని ప‌లువురు వ్య‌క్తం చేస్తున్నారు. ఇలా అంద‌రిని దూరం చేసుకొని మోడీ ఏం చేయానుకులంటున్నారో?
Tags:    

Similar News