19 సార్లు కరోనా పాజిటివ్ ..తరువాత ఏమైందంటే !

Update: 2020-04-24 23:30 GMT
కరోనా మహమ్మారి ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి దేశానికీ విస్తరించింది. చైనాలో మొదలైన ఈ మహమ్మారి ఇప్పుడు ప్రతి దేశానికీ వ్యాప్తి చెందింది. మన దేశంలో కూడా కరోనా రోజురోజుకి మరింత వేగంగా విజృంభిస్తుంది. ఇప్పటికే దేశంలో 23 వేలకి పైగా కరోనా కేసులు నమోదు అయ్యాయి. 722 మంది కరోనా భారిన పడి మృతిచెందారు. అలాగే మరోవైపు దేశ వ్యాప్తంగా కరోనా నిర్దారణ పరీక్షలు కూడా చాలా వేగంగా జరుగుతున్నాయి.

ఇక అసలు విషయానికొస్తే ..తాజాగా కేరళకి చెందిన ఒక మహిళకి 19 సార్లు కరోనా పాజిటివ్ గా వచ్చిన విషయం తెలిసిందే, ఆ మహిళకి తాజాగా నిర్వ‌హించిన రెండు ప‌రీక్ష‌ల్లో నెగెటివ్ రావ‌డంతో త్వ‌ర‌లోనే ఆమెను డిశ్చార్జ్ చేయ‌నున్న‌ట్లు ఆసుప‌త్రి వ‌ర్గాలు వెల్లడించాయి. కేర‌ళలోని ప‌త‌న‌మిట్ట ప్రాంతానికి చెందిన 62 ఏళ్ల మ‌హిళ కుటుంబ స‌భ్యులు ఇట‌లీకి వెళ్లివ‌చ్చారు. ఆ త‌ర్వాత ఎప్ప‌టిలాగానే అనేక కార్య‌క్ర‌మాల‌కు హాజ‌ర‌య్యారు. మార్చి 10న వారికి ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా క‌రోనా సోకిన‌ట్లు తేలింది. దీంతో కుటుంబం మొత్తాన్ని క్వారంటైన్‌ లోకి త‌ర‌లించి చికిత్స అందించారు.

గత రెండు వారాల క్రితం వారంద‌రికీ నెగెటివ్ రావ‌డంతో ఆసుప‌త్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. అయితే అప్ప‌టికే వారితో స‌న్నిహితంగా మెలిగిన వారికి సైతం క‌రోనా సోక‌గా అందులో 93 ఏళ్ల వృద్ధుడితోపాటు 88 ఏళ్ల బామ్మ కూడా క‌రోనా నుంచి కోలుకున్నారు. కానీ, ఈమె ఒక్క‌రికే త‌ర‌చూ పాజిటివ్ అని తేలడంతో ఆసుప‌త్రిలోనే ఉండిపోయింది. 45రోజుల పోరాటం అనంత‌రం ఎట్ట‌కేల‌కు క‌రోనాను జ‌యించింది. ఇదిలా వుండ‌గా కొంత‌మందిలో ఆల‌స్యంగా వైర‌స్ బ‌య‌ట ‌పడుతుండ‌టంతో కేర‌ళ‌లో క్వారంటైన్ గ‌డుపును 28 రోజుల‌కు పొడిగించిన సంగ‌తి తెలిసిందే.
Tags:    

Similar News