పార్లమెంటు సమావేశాలు సజావుగా సాగితే ఈనెల 30వ తేదీన రాష్ట్ర విభజన హామీలపై కేంద్ర ప్రభుత్వం కీలకమైన ప్రకటన చేసే అవకాశం ఉంది. 2014లో జరిగిన రాష్ట్ర విభజన హామీలేమిటి ? ఇచ్చిన హామీల్లో కేంద్రం ఎన్నింటిని అమలు చేసింది ? పెండింగ్ లో ఉన్న హామీలేంటి ? అనే అంశంపై 30వ తేదీన హోంశాఖ మంత్రి అమిత్ షా కానీ లేకపోతే హోంశాఖ సహాయమంత్రి కానీ సమాధానం చెప్పే అవకాశం ఉంది.
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే విభజన సందర్భంగా అప్పటి యూపీయే ప్రభుత్వం రాజ్యసభలో కానీ లేదా చట్టంలో చెప్పిన హామీల్లో కీలకమైన వాటిని ఎన్డీయే ప్రభుత్వం తుంగలో తొక్కేసింది. ప్రత్యేక హోదా, వైజాగ్ కేంద్రంగా ప్రత్యేక రైల్వేజోన్, వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి నిధులు లాంటి వాటిని నరేంద్ర మోడీ సర్కార్ పూర్తిగా గాలికొదిలేసింది.
ప్రత్యేక హోదా స్థానంలో ప్రత్యేక ప్యాకేజీ అని ప్రత్యేక రైల్వే జోన్ ప్లేసులో ప్రత్యేక డివిజన్ అని ఏదోదే చెప్పింది. పోనీ అవన్నా అమలు చేసిందా అంటే అదీ లేదు.
ఏవో కాకిలెక్కలు చెప్పేసి ప్యాకేజీలో భాగంగా ఇన్ని కోట్లు ఇచ్చేశామని కాబట్టి ఇక ఇచ్చేదేమీ లేదని తేల్చేసింది. ప్రత్యేక రైల్వోజోన్ హామీని కూడా చీలికలు పీలికలు చేసి కంపు చేసేసింది. ఇక విద్యాసంస్థలు, యూనివర్సిటీ, ఆసుపత్రుల్లాంటివి అరాకొరా ఇచ్చి విభజన చట్టం మొత్తాన్ని అమలు చేసేసినట్లు చెప్పుకుంటోంది. ఇంకా గట్టిగా మాట్లాడితే విభజన చట్టంలో చెప్పినవాటికన్నా ఇంకా ఎక్కువే చేశామని దబాయిస్తోంది.
ఏదేమైనా విభజనను సరిగా చేయకుండా చట్టాన్ని సరైన పద్ధతిలో తయారుచేయకుండా అప్పటి యూపీఏ ప్రభుత్వం ఏపీని దెబ్బకొడితే ఇప్పటి నరేంద్రమోడి సర్కార్ దాన్ని కంపుచేసేసి ఏపీని మరింతగా నాశనం చేసేసింది. ఇవన్నీ ఇలాగుంటే కేంద్రమే నిర్మించాల్సిన పోలవరం ప్రాజెక్టును తన చేతుల్లోకి తీసుకోవటం ద్వారా చంద్రబాబునాయుడు మరింత అన్యాయం చేశారు. ప్రాజెక్టును చంద్రబాబు తన చేతుల్లోకి తీసుకోకుండా ఉండుంటే ఇఫుడు నిధుల సమస్యని, అంతర్రాష్ట్ర సమస్యల వివాదం ఉండేదే కాదు.
రాష్ట్రాభివృద్ధి విషయంలో మన పార్టీలకు కమిట్మెంట్ లేని కారణంగానే ఏపీ ఇన్ని సమస్యలను ఎదుర్కొంటోంది. కేంద్రంలో ఎవరు అధికారంలో ఉన్నా మనకు దక్కాల్సిన ప్రయోజనాలను దక్కించుకోవటంలో తమిళనాడును చూసి కూడా మన ఎంపీలు నేర్చుకోవటంలేదు.
ఎంతసేపు ఆధిపత్యం కోసం ఒకరిపై మరొకరు బురదచల్లేసుకోవటం, ఆరోపణలు, విమర్శలతో కాలం గడిపేయటం తప్ప రాష్ట్రప్రయోజనాలు దెబ్బతింటున్నాయన్న కనీస స్పృహకూడా లేకపోవటమే విచిత్రంగా ఉంది. మరి 30వ తేదీ కేంద్రం ఏమి సమాధానం ఇస్తుందో చూడాల్సిందే.