దీదీకి భారీ షాక్.. అనారోగ్యంతో కీలక మంత్రి కన్నుమూత

Update: 2021-11-05 04:05 GMT
పశ్చిమబెంగాల్ రాష్ట్ర మంత్రి సుబ్రతా ముఖర్జీ కన్నుమూశారు. వారం క్రితం అనారోగ్యంతో ఆసుత్రిలో చేరిన ఆయన.. గురువారం రాత్రి కార్డిక్ అరెస్టుతో మరణించినట్లుగా వైద్యులు వెల్లడించారు. 75 ఏళ్ల ఈ సీనియర్ నేత దీదీ మంత్రివర్గంలో కీలకంగా చెబుతారు. ప్రస్తుతం నాలుగు ముఖ్యమైన శాఖల్ని చూస్తున్న ఆయన మరణం.. తనకు తీరని లోటుగా బెంగాల్ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వెల్లడించారు. ఆయన మరణవార్త పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

సుబ్రతా మరణం గురించి తెలిసినంతనే సీఎం దీదీ వెంటనే ఆసుపత్రికి వెళ్లారు. ఆయన ఇక లేరన్న విషయాన్ని తాను నమ్మలేకపోతున్నట్లుగా పేర్కొన్నారు.ఎంతో నిబద్ధత కలిగిన నేతగా పేర్కొన్న ఆమె.. ఆయన మరణం తనకు వ్యక్తిగతంగా ఎంతో నష్టమని.. అది ఎంతకూ పూడ్చలేనిదిగా ఆమె పేర్కొన్నారు. బెంగాల్ రాజకీయాల్లో సుబ్రతో ప్రత్యేక ఇమేజ్ కలిగి ఉన్నారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి త్రిమూర్తుల్లో ఒకరైన ఆయన.. సుదీర్ఘ కాలం కాంగ్రెస్ లో ఉండి.. ఆ తర్వాత దీదీ పార్టీలో చేరారు. అప్పటి నుంచి ఆయన పార్టీలోనే కొనసాగుతన్నారు.

అక్టోబరు24న ఆయనకు శ్వాస సంబంధమైన సమస్యలు ఎదురుకావటంతో ఆయన్ను ఆసుపత్రిలో చేర్చారు. అప్పటి నుంచి ఆయన్ను ఐసీయూలో ఉంచి చికిత్స చేపట్టారు. నవంబరు ఒకటిన ఆయనకు ఏంజియో ప్లాస్టీ చేశారు. గురువారం రాత్రి 9.22 గంటలకు కార్డియాక్ అరెస్ట్ తో మరణించినట్లుగా వైద్యులు ధ్రువీకరించారు. ఆయన పార్థీపదేహాన్ని ప్రజల సందర్శన కోసం కోల్ కతాలోని రవీంద్ర సదన్ కు తరలిస్తారు. అనంతరం బల్లీ గంజేలోని ఆయన పూర్వీకుల ఇంటికి తరలించి.. అంత్యక్రియలు చేపడతారు.

ఈ ఏడాది మేలోనూ ఆయన తీవ్ర అస్వస్థతతో ఆసుపత్రిలో చేరారు. కోలుకున్న అనంతరం ఆయన్నునారద ముడుపుల కేసులో అరెస్టు చేయాలని సీబీఐ ఆదేశించటం.. ఆయన్ను అదుపులోకి తీసుకోవటం.. ఆ వెంటనే బెయిల్ రావటం తెలిసిందే. ఆయన అరెస్టు అప్పట్లు హాట్ టాపిక్ గా మారింది. రాజకీయ అలజడికి కారణమైంది. సుబ్రతో రాజకీయ ప్రస్థానాన్ని చూస్తే.. 1970లో ఆయన రాజకీయాల్లోకి అడుగు పెట్టారు. బెంగాల్ కాంగ్రెస్ కు త్రిమూర్తులగా అభివర్ణించే వారు. ఆ త్రిమూర్తుల్లో సుబ్రతతో ఒకరైతే.. మరో ఇద్దరు సౌమిన్ మిత్రా.. ప్రియరంజన్ దాస్ మున్సీలు. అయితే.. వారిలో 2008లో సౌమిన్.. 2010లో సుబ్రతో కాంగ్రెస్ ను విడిచి పెట్టేశారు. ఇదిలా ఉంటే.. ప్రియరంజన్ దాస్ మున్షీ 2017లో మరణిస్తే.. సౌమిన్ గత ఏడాది మరణించారు. తాజాగా సుబ్రతో కన్నుమూశారు.


Tags:    

Similar News