తెలుగు అకాడమీ కేసులో కీలక ట్విస్ట్... ఏమిటంటే!

Update: 2021-10-04 08:30 GMT
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ తెలుగు అకాడమీ నిధుల గోల్‌ మాల్‌ కేసులో సంచలన సృష్టిస్తోన్న సంగతి తెలిసిందే. అయితే, ఈ తెలుగు అకాడమీ నిధుల గోల్‌ మాల్‌ కేసులో మరో ట్విస్ట్‌ చోటు చేసుకుంది. అసలు ఇందులో కీలక సూత్రధారులు ఎవరు? ఎక్కడి నుంచి ఎవరికి నిధులు మళ్లాయి, తెలుగు అకాడమీ స్కాంలో ఇంకెవరెవరున్నారు, కీలక సూత్రధారులు ఎవరు అన్నదానిపై సీసీఎస్‌ పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇప్పటికే నలుగురిని అరెస్ట్‌ చేసి వారిని ప్రశ్నిస్తున్న పోలీసులు, నిధుల తరలింపులో కీలక పాత్ర పోషించిన రాజ్‌కుమార్, శ్రీనివాస్, సోమశేఖర్‌ కోసం గాలిస్తున్నారు.

నకిలీ ఆధారాలను రాజ్‌కుమార్ తయారు చేసినట్లు గుర్తించారు. తెలుగు అకాడమీ డబ్బులతో పాటు ప్రైవేటు వ్యక్తుల డిపాజిట్ కూడా కొట్టేశారు నిందితులు. అకాడమీకి చెందిన 54 కోట్ల రూపాయల తో పాటు ప్రైవేట్ వ్యక్తుల డిపాజిట్లు కాటేజారు ఈ నిందితులు. యూనియన్, బ్యాంక్ కెనరా బ్యాంకులో డిపాజిట్ చేసిన ప్రైవేట్ వ్యక్తుల డబ్బులను కొల్లగొట్టిన ముఠా, డిపాజిట్లను నకిలీ పత్రాలతో స్వాధీనం చేసుకుంది. నకిలీ డిపాజిట్ సర్టిఫికెట్ లతో ప్రైవేటు వ్యక్తుల నగదును బదిలీ చేశారు. అకాడమీ, ప్రైవేట్ వ్యక్తుల డబ్బులను కాజేసిన మస్తాన్వలి, మస్తాన్వలి కి ఆరుగురు సహకరించినట్లు గా పోలీసుల గుర్తించారు.

ఇప్పటికీ నలుగురిని అరెస్టు చేసిన సిసిఎస్ పోలీసులు , మరొక ఇద్దరి కోసం గాలిస్తున్నారు. అకాడమీ, ప్రైవేట్ వ్యక్తుల డబ్బులను అగ్రి సీన్ బ్యాంక్ నుంచి ఏపీ కోపరేటివ్ సొసైటీ కి బదిలీ చేశాడు మస్తాన్ వలి. ఏపీ మార్కెటింగ్ సొసైటీ చైర్మన్ సహకారంతో డబ్బులు డ్రా చేసుకుంది మస్తాన్ వలీ అండ్ గ్యాంగ్. ఇక నిధుల గల్లంతు వ్యవహారంపై నివేదిక కోరింది ఏపీ ఇంటిలిజెన్స్. దీనిపై నేడు నివేదిక సమర్పించనుంది ప్రభుత్వ త్రిసభ్య కమిటీ. మస్తాన్‌ వలి, సత్యనారాయణ కలిసి నిధులు మళ్లించినట్లు నిర్ధారించారు. ఏపీ, ముంబైతోపాటు హైదరాబాద్‌లోని కొంతమందికి డబ్బులు చేర్చినట్లుగా దర్యాప్తులో తేల్చారు పోలీసులు.ఎఫ్‌డీలను డ్రా చేయాలనే ఆలోచన మస్తాన్ వలిదే అని తెలుస్తోంది. ఫిక్స్‌డ్ డిపాజిట్లను ఇతర బ్యాంకులకు తరలించి డబ్బులు డ్రా చేసింది మస్తాన్ వలీ గ్యాంగ్.

6 నెలల కాలంలో 64 కోట్లు దోచేశారు. ఇందుకు అకాడమీకి చెందిన వ్యక్తులు మస్తాన్‌ వలీకి సహకరించినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మరిన్ని కీలక ఆధారాలు సేకరించేందుకు, అకాడమీలోని అకౌంట్ సెక్షన్‌ లో మరికొంతమందిని ప్రశ్నిస్తున్నారు పోలీసులు. అరెస్టు చేసిన నలుగురిని పది రోజుల కస్టడీకి ఇవ్వాలంటూ కోర్టులో పిటిషన్‌ వేశారు సీసీఎస్‌ పోలీసులు. మరోవైపు తెలుగు అకాడమీ మాజీ డైరెక్టర్‌ సోమిరెడ్డికి సీసీఎస్ నోటీసులు జారీ చేసింది. సోమిరెడ్డితో పాటు అకౌంట్స్ అధికారికి సైతం పిలుపువచ్చింది. అంతేకాదు అకాడమీ ఉద్యోగులందరూ అందుబాటులో ఉండాలని ఆదేశించింది. అటు విచారణ లో ఔట్ సోర్సింగ్ ఉద్యోగి రఫితో ఉన్న ఆర్థిక లావాదేవీలు వెలుగులోకి వచ్చాయి.
Tags:    

Similar News