`కలికాలం`లో జరుగుతోన్న కొన్ని ఘటనలు చూస్తుంటే యుగాంతం ఎంతో దూరంలో లేదనిపిస్తోంది. బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పిన దానికంటే వేగంగా మనిషి పతనమైపోతున్నాడనడానికి నిలువెత్తు తార్కాణాలు నిజజీవితంలో నిత్యం తారసపడుతూనే ఉన్నాయి. ముక్కుపచ్చలారని పసిపిల్లల నుంచి పండు ముసలివారిపై అత్యాచారాలు, లైంగిక వేధింపులు.....పది రూపాయల కోసం ప్రాణాలు తీసే కసాయిలు...సంచరిస్తున్న అ`నాగరిక`సమాజంలో మనం బ్రతుకుతున్నాం. మనిషి సంఘజీవి కాదు స్వార్థ జీవి....అన్న స్థాయికి దిగజారామంటే పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. తాజాగా, మానవత్వం మంట గలిసిపోయిందనే రీతిలో ఓ హృదయవిదారక ఘటన ఖమ్మం జిల్లాలో జరిగింది. రోడ్డు ప్రమాదానికి గురై రక్తపు మడుగులో ప్రాణాల కోసం కొట్టుమిట్టాడుతున్న ఓ వ్యక్తిని కాపాడాల్సిన జనం....సెల్ఫీలు తీస్తూ చోద్యం చూశారు. అతడికి సాయం చేయాల్సింది పోయి.....ఫొటోలు, వీడియోలు తీసుకుంటూ కాలయాపన చేశారు. సకాలంలో స్పందించేవారు లేక ఆ వ్యక్తి అశువులు బాశాడు.
ఖమ్మం జిల్లా రఘునాథ్ పాలెం పోలీస్ స్టేషన్ లో ఏఎస్సైగా విధులు నిర్వహిస్తున్న బీ భాస్కర్ శుక్రవారం ఉదయం బందోబస్తుకు వెళ్లారు. స్టేషన్ కు తిరిగి వచ్చాక జీపు దిగి....తన వాహనం కోసం రోడ్డు దాటుతున్నారు. ఆ సమయంలో హఠాత్తుగా మితిమీరిన వేగంతో దూసుకువచ్చిన సిమెంటు ట్యాంకర్ ఆయన ఢీకొట్టింది. పొట్ట కింద భాగం పై నుంచి లారీ వెళ్లడంతో భాస్కర్ కు తీవ్రమైన గాయాలయ్యాయి. రక్తపు మడుగులో ప్రాణం కోసం పోరాడుతోన్న భాస్కర్ దగ్గర జనం గుమిగూడారు. అయితే, వారంతా భాస్కర్ ను కాపాడాల్సింది పోయి....ఫొటోలు, వీడియో లు తీస్తూ పైశాచికానందం పొందారు. విషయం తెలుసుకున్న కొందరు కానిస్టేబుళ్లు హుటాహుటిన పోలీస్ వాహనంలోనే భాస్కర్ ను ఖమ్మం జిల్లా ఆస్పత్రికి తరలించారు. అయితే, తీవ్ర రక్తస్రావం కావడంతో ఆయన మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. సకాలంలో స్పందించి ఉంటే భాస్కర్ బ్రతికి ఉండేవారని పలువురు అభిప్రాయపడుతున్నారు. స్థానికుల తీరుపై పోలీసులు అసంతృప్తి వ్యక్తం చేశారు. వచ్చే నెలలో పదవీ విరమణ చేయబోతోన్న భాస్కర్ అకాల మరణం ఆ కుటుంబాన్ని తీవ్రంగా కలచి వేస్తోంది. భాస్కర్ కు భార్య, ఐదుగురు పిల్లలున్నారు.