కుష్బూ పోస్ట్​ చదివారంటే కన్నీళ్లు ఆగవు..!

Update: 2021-01-10 16:34 GMT
ఇటీవల ఉత్తరప్రదేశ్​ రాష్ట్రంలో కొందరు యువకులు ఓ డాల్ఫిన్​ను గొడ్డలితో కొట్టి దారుణంగా హింసించి చంపేసిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించిన ఓ వీడియో సోషల్​మీడియాలో వైరల్​గా మారింది. యూపీ యువకులపై పోలీసులు కూడా కేసు నమోదు చేశారు. అయితే సదరు యువకులు చేపల వేటకు వెళ్లగా వాళ్లకు డాల్ఫిన్​ పడింది. ముందు వాళ్లు దాన్ని సొరచేప (తిమింగలం) అనుకున్నారు. కానీ అది డాల్ఫిన్​ అని తెలియడంతో దాన్ని దారుణంగా గొడ్డలితో నరికి చంపేశారు. ఈ వీడియో చూసిన జంతుప్రేమికులు తీవ్రంగా స్పందించారు. యువకులను కఠినంగా శిక్షించాలంటూ పోస్టులు పెట్టారు.

అయితే ఈ విషయంపై తాజాగా సినీ నటి కుష్బూ స్పందించారు..
ఇటువంటి మనుషులు కూడా ఉంటారా? అని కుష్బూ అన్నారు. ఆమె ఈ వీడియోను షేర్​ చేశారు.
‘ అసలు వీళ్లు మనుషులేనా అని నాకు అనుమానం కలిగింది. ఇటువంటి వాళ్లు ఇంకెప్పుడు మారుతారో? రక్తం చిందుస్తున్నా.. డాల్ఫిన్​, గొడ్డలి, కర్రలతో చంపేశారంటే వాళ్లు నిజంగా మనుషులు కారు. ఈ ఘటన హృదయ విదారకరం. ఇలాంటి మనుషుల్లో ఇంకెప్పుడు మార్పు వస్తుంది? సాటి జీవాలను బ్రతికే హక్కు లేదా' అంటూ ఆమె ఎమోషనల్​ కామెంట్​ చేశారు.

గతంలో కేరళలోనూ ఓ ఏనుగును చంపేయడం సంచలనం సృష్టించింది. అప్పట్లో గర్భంతో ఉన్న ఓ ఏనుగుకు పైనాపిల్​ ఆశచూపి కొందరు దుండగులు దారుణానికి పాల్పడ్డారు. టపాసులతో నింపిన పైనాపిల్​ను ఏనుగుకు తినిపించారు. ఆ పైనాపిల్​ తిన్న తర్వాత దాని కడుపులో పేలుడు సంభవించి ఏనుగు మృతిచెందింది. అప్పట్లో ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ప్రస్తుతం డాల్ఫిన్​కు సంబంధించిన వీడియో కూడా వైరల్​గా మారింది.


Tags:    

Similar News