సుఖాంతమైన చటాన్‌ పల్లి స్నేహిత కిడ్నాప్ కథ!

Update: 2019-12-18 10:22 GMT
చటాన్‌ పల్లిలో నాలుగేళ్ల బాలిక కిడ్నాప్ కథ ఎట్టకేలకు సుఖాంతమైంది. జడ్చర్లకు చెందిన శివ మేస్త్రీగా పని చేస్తున్నాడు. ఆయన కుమార్తె స్నేహిత షాద్‌ నగర్ పబ్లిక్ స్కూల్‌ లో ఎల్‌ కేజీ చదువుకుంటుంది. సాయంత్రం స్కూల్ నుంచి వచ్చిన చిన్నారి ఇంటి ముందు ఆడుకుంటున్న సమయంలో, దీన్ని గమనించిన  కిడ్నాపర్ చాక్లెట్‌ ఇస్తామని చెప్పి.. పాపను బైక్ పై ఎక్కించుకొని తీసుకోని వెళ్ళిపోయాడు. తరువాత కొద్దిసేపటికి పాప కనిపించని విషయం గమించిన ఆ తల్లిదండ్రులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.

దీనితో రంగంలోకి దిగిన పోలీసులు సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా పాప జాడను పట్టుకున్నారు. పాపను ఓ వ్యక్తి బైక్‌ ఎక్కించుకుని జడ్ చర్ల వైపు వెళ్లడాన్ని పోలీసులు గమనించారు. దీంతో ఆ మార్గంలో తనిఖీలు చేపట్టి కిడ్నాపర్‌ ను పట్టుకున్నారు. స్నేహితను అతడి బారి నుంచి కాపాడి తల్లిదండ్రులకు అప్పగించారు. పాపను కిడ్నాప్ చేసిన వ్యక్తి కూడా జడ్ చర్ల కు చెందిన వాడేనని - ఆ దంపతులకు పిల్లలు లేకపోవడంతోనే బాలికను కిడ్నాప్ చేసి తీసుకెళ్లినట్లు చెబుతున్నారు. దిశ కేసులోని నలుగురు నిందుతులని  ఎన్ కౌంటర్ చేసిన చటాన్‌ పల్లి లో ఈ ఘటన జరగడంతో పోలీసులు వెంటనే అప్రమత్తమై కేవలం 24 గంటల్లోనే పాపని తల్లిదండ్రులకి అప్పగించారు.
Tags:    

Similar News